సిద్దిపేట ఐటీ టవర్‌ను సందర్శించే అవకాశం దక్కింది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న యువతతో ఆత్మీయంగా ముచ్చటించి, ఐటీ టవర్‌లో ఉన్న సౌకర్యాలు, పని వాతావరణం, సంస్థల కార్యకలాపాల గురించి వివరాలు తెలుసుకున్నాను. సొంత ఊరిలోనే మంచి ఉద్యోగ అవకాశాలు కలగాలనే యువత ఆశయాలను దృష్టిలో ఉంచుకుని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సిద్దిపేటలో ఐటీ టవర్‌ను స్థాపించడం జరిగింది. గ్రామీణ మరియు అర్బన్ ప్రాంతాల మధ్య ఉన్న అవకాశాల తేడాను తగ్గించడంలో ఈ ఐటీ టవర్ ముఖ్యపాత్ర పోషిస్తోంది అన్నారు.
ప్రస్తుతం సిద్దిపేట ఐటీ టవర్‌లో 17 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తూ, సుమారు 350 మంది యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఇది స్థానిక ఆర్థికాభివృద్ధికి, యువత స్వావలంబనకు దోహదపడుతోంది. అదేవిధంగా సిద్దిపేటలో టాస్క్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, ఐటీ మరియు సాఫ్ట్ స్కిల్స్‌కు సంబంధించిన శిక్షణను నిరంతరం అందిస్తున్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Also Read:మున్సిపల్ ఎన్నికలు..ఉద్రిక్త పరిస్థితులు
స్థానిక యువత ఈ శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకుని, నైపుణ్యాలను పెంపొందించుకొని, ఐటీ రంగంలో మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాను. సిద్దిపేటను ఐటీ హబ్‌గా మరింత అభివృద్ధి చేయాలన్నది మన లక్ష్యం అన్నారు.

