ఒకప్పుడు మద్యాన్ని సరదా కోసం తాగేవారు. కానీ ఇప్పుడు మందే సర్వస్వం అయ్యేలా పరిస్థితి తయారైంది. ఎందుకంటే కొంతమందికి మందు అనేది అప్పుడప్పుడు పార్టీకి, కలయికకు పరిమితమవుతుంది. అలాంటి వాళ్లకు అది సరదా, స్ట్రెస్ రిలీఫ్ మాత్రమే. కానీ మరికొందరికి అదే మందు అలవాటుగా మారి, రోజు గడవని పరిస్థితి వస్తుంది.
అయితే మందు తాగే వరకు బాగానే ఉన్నా.. మందుబాబులకు అసలు పెగ్గు కథ అంటే ఏంటో తెలుసా. సాధారణంగా మందు తాగే వారి నోటి నుండి వచ్చే మాట..స్మాల్ పెగ్, లార్జ్ పెగ్, పటియాలా పెగ్.స్మాల్ పెగ్ అంటే 30 మిల్లీలీటర్లు,లార్జ్ పెగ్ అంటే 60 మిల్లీలీటర్లు.కానీ 40 లేదా 50 మిల్లీలీటర్ల పెగ్ ఎందుకు ఉండదని ఎప్పుడైనా ఆలోచించామా? అంటే చాలామందికి తెలియదు.
వాస్తవానికి ‘పెగ్’ అనే పదం బ్రిటన్ నుంచి వచ్చింది. అది Precious Evening Glass అనే మాటకు సంక్షిప్త రూపం అని చెబుతారు.పాతకాలంలో గనుల్లో పనిచేసే కార్మికులకు రోజంతా శ్రమించిన తర్వాత సాయంత్రం ఒక గ్లాస్ మద్యం ఇవ్వడం ఆనవాయితీగా ఉండేది. ఆ గ్లాస్ వారికి ఎంతో విలువైనదిగా ఉండేది.అందుకే అది “విలువైన సాయంత్రపు గ్లాస్”గా మారింది.
కానీ ఎప్పుడైనా ఆలోచించారా?..40 లేదా 50 మిల్లీలీటర్ల పెగ్ ఎందుకు లేదు?, ‘PEG’ అనే పదానికి అసలు అర్థం ఏమిటి?, ఈ కొలతల వెనుక శాస్త్రం ఏంటి?..PEG అనే పదం ఎలా వచ్చింది? తెలుసా. ‘PEG’ అనేది ఒక Acronym. P – Precious,E – Evening,G – Glass.
పూర్వకాలంలో బ్రిటన్‌లో బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు రోజంతా కఠినంగా శ్రమించేవారు. సాయంత్రం పని ముగిశాక వారి అలసట తీర్చేందుకు ఒక గ్లాస్ మద్యం ఇచ్చేవారు. ఆ గ్లాస్ వారికి ఎంతో విలువైనదిగా ఉండడంతో దాన్ని Precious Evening Glass అని పిలిచేవారు. కాలక్రమంలో అదే ‘PEG’గా మారింది.
60 మిల్లీలీటర్లే ఎందుకు?..ఇక్కడే శాస్త్రం రంగంలోకి వస్తుంది.మన శరీరంలో మద్యం ప్రభావాన్ని నియంత్రించే ముఖ్య అవయవం లివర్ (కాలేయం). శాస్త్రీయంగా ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి లివర్ ఒక గంటలో సుమారు 30 మిల్లీలీటర్ల మద్యాన్ని మాత్రమే జీర్ణం చేయగలదు.అందుకే:30 మి.లీ (స్మాల్ పెగ్) → 1 గంట,60 మి.లీ (లార్జ్ పెగ్) → 2 గంటలు,ఈ కొలత ఉద్దేశం ఏమిటంటే, మద్యం నెమ్మదిగా తాగాలి, లివర్‌కు పనిచేయడానికి సమయం ఇవ్వాలి. అవసరానికి మించి తాగితే లివర్‌పై ఒత్తిడి పెరిగి ఆల్కహాల్ పాయిజనింగ్ ప్రమాదం ఉంటుంది.
ఔన్స్ నుంచి మిల్లీలీటర్లకు..ఈ కొలతలు బ్రిటిష్ పద్ధతిలోని Ounces నుంచి వచ్చాయి.1 ఔన్స్ ≈ 29.57 మి.లీ (సుమారు 30),2 ఔన్స్ ≈ 59.14 మి.లీ (సుమారు 60),
అందుకే ఈ రౌండ్ ఫిగర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.
Also Read:లాఫ్ రైడ్‌లా ‘గాయపడ్డ సింహం’!
90–120 మి.లీ వరకు ఉండే పటియాలా పెగ్ పేరు పటియాలా మహారాజా భూపేంద్ర సింగ్ నుంచి వచ్చింది. ఆయన భారీ శరీరాకృతి, రాజసమైన పార్టీల వల్ల పెద్ద గ్లాసులు వాడటం ఆనవాయితీగా మారింది.
నోట్: మితంగా తాగితే మత్తు ఆనందంగా ఉంటుంది..అతి తాగితే అదే ప్రమాదంగా మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది.

