హైదరాబాద్ నగరంలో దోమల ఉధృతి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్న భావనతో ఈ అంశాన్ని నటుడు ఎస్‌ఎస్ కార్తీకేయ వ్యంగ్యంగా ప్రస్తావించారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న కార్తీకేయ, అర్థరాత్రి జరుగుతున్న షూటింగ్ సమయంలో దోమల దాడితో యూనిట్ ఎదుర్కొన్న ఇబ్బందులను వీడియో రూపంలో చూపించారు. షూటింగ్ లైట్ల చుట్టూ గుంపులుగా తిరుగుతున్న దోమలను ఆయన కెమెరాలో బంధించారు. “హైదరాబాద్ దోమలు మామూలు కావు” అన్న భావనతో చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. నగరంలో దోమల నివారణ చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Thellaaarluuu okate musiccuuuu … 🤧🤧#DontTroubleTheTrouble #FahadhFaasil pic.twitter.com/BlpOCGUfwQ
— Showing Business (@SBbySSK) February 6, 2026
Also Read:TTD:మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవం

