ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ శిక్షణ సమయంలో బంతి తగలడంతో కంటికి గాయమై, ముక్కు నుంచి రక్తం కారిన ఘటన చోటుచేసుకుంది. గాయంతో ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న ఆయన, న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో స్టోక్స్ బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయడం లేదు. సహచరులతో పాటు పక్కన నిలబడి ఉండగా, అకస్మాత్తుగా వచ్చిన బంతి ఆయనను తాకింది.
బంతి నేరుగా తగలడంతో ఆయన కుడి కన్ను బాగా వాపు రావడం, ముక్కు నుంచి రక్తం కారడం కనిపించింది. ఈ టెస్ట్ కెప్టెన్ గాయం తర్వాత పరిస్థితిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, గాయం తీవ్రత కనిపించినప్పటికీ దాన్ని సరదాగా తీసుకునే ప్రయత్నం చేశాడు.
క్రికెట్ బంతి పరిస్థితి చూస్తే ఇంకా ఆశ్చర్యపడతారు అని స్టోక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ సంఘటన, ఇప్పటికే యాషెస్ సిరీస్‌లో గాయపడిన స్టోక్స్ కోలుకుంటున్న సమయంలో జరగడం గమనార్హం.
32 ఏళ్ల స్టోక్స్ ప్రస్తుతం ఇంగ్లండ్ వైట్-బాల్ జట్టుకు అందుబాటులో లేడు. రాబోయే టీ20 వరల్డ్‌కప్‌లో కూడా పాల్గొనడు. జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగే హోమ్ టెస్టు సిరీస్‌లో మళ్లీ రెడ్-బాల్ క్రికెట్‌కు తిరిగి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 4-1తో ఘోరంగా ఓడిన తర్వాత, స్టోక్స్ నాయకత్వం చర్చనీయాంశంగా మారింది. సిరీస్ అనంతరం స్టోక్స్ చేసిన వ్యాఖ్యలపై, ముఖ్యంగా ఫలితం ఏకపక్షంగా ఉన్నప్పటికీ ఆటగాళ్ల కృషిని ప్రశంసించిన తీరుపై, మాజీ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ బహిరంగంగా ప్రశ్నించారు.
Also Read:Harishrao:రేవంత్ స్కామ్ క్యాలెండర్ విడుదల

