వరల్డ్ కప్‌లో తమ జట్టు భారత్‌తో ఆడబోదని స్పష్టం చేశారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్.2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలనే అంశాన్ని పాకిస్తాన్ పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ 2026లో గ్రూప్ దశలో భారత్‌తో పాకిస్తాన్ జట్టు ఆడదని ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారికంగా ప్రకటించారు.
ఇస్లామాబాద్‌లో జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో మాట్లాడిన ఆయన, ఈ విషయంలో పాకిస్తాన్ స్పష్టమైన వైఖరితో ఉందని, భారత్‌తో మ్యాచ్ ఆడబోమని తేల్చిచెప్పారు.టీ20 ప్రపంచకప్ విషయంలో మేం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం. భారత్‌తో జరిగే మ్యాచ్‌ను మేం ఆడము అని పాకిస్తాన్ ప్రధాని తెలిపారు.ఈ నిర్ణయాన్ని అన్ని కోణాల్లో జాగ్రత్తగా ఆలోచించి తీసుకున్నాం. ఇది సరైన నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు.
Also Read:‘ధురంధర్’2లో యామీ గౌతమ్!
షెడ్యూల్ ప్రకారం భారత్–పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15, ఆదివారం నాడు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగాల్సి ఉంది. గ్రూప్ దశ తర్వాత ఫైనల్లో కూడా ఇరు జట్లు తలపడే అవకాశం ఉంది. అయితే టైటిల్ మ్యాచ్‌లో భారత్‌తో ఆడితే పాకిస్తాన్ వైఖరి ఏమిటనేది ఇప్పటికీ స్పష్టత లేదు.

