DD55:ధనుష్‌తో సాయిపల్లవి!

2
- Advertisement -

ధనుష్ హీరోగా నటిస్తున్న D55 చిత్రంలో తెలుగు అందం శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా వచ్చిన అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమాలో మరో ముఖ్యమైన మహిళా పాత్ర కూడా ఉండగా, ఆ పాత్రలో డ్యాన్స్ సంచలనం సాయి పల్లవి నటించనున్నారు.

‘మారి 2’ తర్వాత ధనుష్, సాయి పల్లవి కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇదే. ఈ సినిమాలో సూపర్ హిట్ పాట ‘రౌడీ బేబీ’ లో వీరిద్దరూ చేసిన అద్భుతమైన డ్యాన్స్ ప్రేక్షకుల మనసులు గెలుచుకుని, యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు మళ్లీ D55తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

అమరన్ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, సమాజంలో కలిసిపోయి జీవించే గుర్తింపు లేని వీరుల కథపై దృష్టి సారిస్తుంది. అంబుచెజియన్, గోపురం ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందించనున్నారు.

Also Read:ఐసీసీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం: బీసీసీఐ

- Advertisement -