టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్ దశలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను ఆడవద్దని పాకిస్తాన్ ప్రభుత్వమే తన జాతీయ జట్టుకు ఆదేశాలు జారీ చేసింది. పాక్ నిర్ణయంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పాకిస్తాన్‌పై చర్యలు తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడింది.
ఐసీసీ వరల్డ్ టీ20 2026లో పాల్గొనడానికి పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అనుమతి ఇస్తున్నాం. అయితే 2026 ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు మైదానంలోకి దిగదు,” అని పాకిస్తాన్ ప్రభుత్వం ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ నేపథ్యంలో భారత్–పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే ఐసీసీకి కోట్ల డాలర్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
వాస్తవానికి భారత్–పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే సుమారు 250 మిలియన్ డాలర్లు (రూ. 2,200 కోట్లకు పైగా) ఆదాయం తెస్తుంది. అయితే ఇప్పుడు మ్యాచ్‌పై నీలి మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో హోస్ట్ బ్రాడ్‌కాస్టర్‌కు కూడా భారీ ప్రకటన నష్టం వాటిల్లనుంది. ఒక్క 10 సెకన్ల ప్రకటనకు రూ. 40 లక్షల వరకు ధర పలికే ఈ మ్యాచ్ రద్దయితే, రూ. 200 నుంచి రూ. 250 కోట్ల వరకు ప్రకటన ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది.
ఈ ఒక్క మ్యాచ్ జరగకపోతే మొత్తం నష్టం 250 మిలియన్ డాలర్లు (బ్రాడ్‌కాస్టర్ నష్టమే కాదు, అన్నీ కలిపి). పాకిస్తాన్ వార్షిక క్రికెట్ ఆదాయం కేవలం 35.5 మిలియన్ డాలర్లు మాత్రమే. ఈ తేడా చాలా పెద్దది అని వెల్లడించారు.
Also Read:ఐసీసీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం: బీసీసీఐ

