జన నాయగన్..సుప్రీంకు సెన్సార్ బోర్డు

10
- Advertisement -

జన నాయగన్ సినిమా వివాదంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ అంశాలపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సినీ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్న నేపథ్యంలో, తమ వాదన కూడా తప్పనిసరిగా వినాలంటూ సెన్సార్ బోర్డు కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. నిర్మాతలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అనుకూల ఉత్తర్వులు పొందకుండా ఉండేందుకే ఈ కేవియట్ పిటిషన్ దాఖలు చేసినట్లు సీబీఎఫ్‌సీ వర్గాలు తెలిపాయి.

జన నాయగన్ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు వివాదాస్పదంగా మారడంతో సెన్సార్ సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు అనుమతులు ఆలస్యమయ్యాయి. ఇప్పటికే ఈ నెల 9న థియేటర్లలో విడుదల కావాల్సిన జన నాయగన్, సెన్సార్ వివాదం కారణంగా వాయిదా పడింది. దీనితో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇక మరోవైపు, నిర్మాతలు న్యాయపరమైన మార్గంలో సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సుప్రీంకోర్టు విచారణపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పుతోనే జన నాయగన్ సినిమా భవితవ్యం, విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Also Read:#Varanasi రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -