పరిహారం ఎప్పుడు ఇస్తారో చెప్పండి?

14
- Advertisement -

సిగాచి ప్రమాద బాధితుల పరిహారంపై ప్రభుత్వం పట్ల మరోసారి అసహనం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన 56 మందికి, ఆచూకీ లభించని 8 మందికి, 28 మంది క్షతగాత్రులకు పరిహారం అందించడంతో పాటు, దర్యాప్తు కోసం ప్రత్యేక SIT ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బాబురావు.

ఈ పిటిషన్ విచారిస్తూ, పరిహారం ఎంత ఇస్తామని చెప్పారు, ఎంత ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తారు అంటూ మండిపడ్డారు హైకోర్టు న్యాయమూర్తి. పరిహారం పంపిణీకి సంబంధించిన అంశాలపై కంపెనీ వివరణ ఇవ్వాలని, దానికి సంబం ధించిన వివరాలను తెలియజేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కంపెనీ ప్రకటించిన పరిహారంతో పాటు, చట్టప్రకారం అందాల్సిన పరిహారం వివరాలను సమర్పించాలని ఈపీఎఫ్ హైదరాబాద్ రీజినల్ కమిషనర్, ఈఎస్ఐ డైరెక్టర్, రాష్ట్ర ఔషధ నియంత్రణ మండళ్లను సుమోటో ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేసింది హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్.

Also Read:హిమాలయాల్లో ‘ఆపరేషన్ పసిఫిక్’

- Advertisement -