ఓటీటీలో శంబాల..రికార్డ్!

5
- Advertisement -

ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల’ ఓటీటీలో దూసుకుపోతోంది. ఉగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్చనా అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా జనవరి 21, 2026న ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ అయ్యింది.

విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘శంభాల’, కేవలం ఐదు రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు నమోదు చేసి విశేష స్పందన పొందింది. ఓటీటీలో సినిమాకు లభిస్తున్న ఆదరణ ఆకట్టుకునే స్థాయిలో ఉండటంతో, రాబోయే రోజుల్లో మరింత ట్రాక్షన్ సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమా హిందీ వెర్షన్ ఓటీటీలో విడుదలకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా కథ శంభాల అనే దూర గ్రామంలో పడిన ఒక రహస్య ఉల్కాపాతం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో స్వాసిక విజయ్, మధునందన్, రవి వర్మ, లక్ష్మణ్ మీసాల కీలక పాత్రల్లో నటించారు. సినిమాను మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నాభిమోజు నిర్మించగా, సంగీతాన్ని శ్రీచరణ్ పాకాల అందించారు.

Also Read:Modi:వికసిత్ భారత్ దిశగా అడుగులు

- Advertisement -