దర్శకుడు అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అనిల్ రావిపూడి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవడంతో, ఆయన ఆనందానికి చిరంజీవి ప్రత్యేకంగా స్పందించారు.
సినిమా సక్సెస్‌ను గుర్తుగా అనిల్ రావిపూడికి చిరంజీవి అల్ట్రా ప్రీమియర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారును బహుమతిగా అందజేశారు. ఈ ఖరీదైన గిఫ్ట్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా తనతో పనిచేసిన దర్శకులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించడంలో చిరంజీవి ముందుంటారనే విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే ఉదారతను మరోసారి చాటుకున్నారు.
‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా, వినోదంతో పాటు భావోద్వేగాలను సమపాళ్లలో అందించింది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి.
Also Read:ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, “ఇది నా జీవితంలో మరచిపోలేని క్షణం” అని అన్నారు. మెగాస్టార్ ఇచ్చిన ఈ గిఫ్ట్ తనకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చిందని, భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలు చేయాలనే ఉత్సాహం కలిగించిందని తెలిపారు. చిరంజీవి అభిమానులు కూడా ఈ వార్తపై సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

