టీ హబ్‌ను స్టార్టప్‌ల కేంద్రంగానే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టీ హబ్‌లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తారన్న వార్తలపై ఆయన స్పందించారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీ హబ్‌లో ఇతర ప్రభుత్వ ఆఫీసులకు ఎలాంటి చోటు లేదని సీఎం తేల్చిచెప్పారు.
ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను, అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని అధికారులను ఆదేశించారు. స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు భంగం కలిగించే నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదని సూచించారు.
టీ హబ్ తెలంగాణకు గర్వకారణమని, యువత, పారిశ్రామికవేత్తలు, కొత్త ఆవిష్కరణలకు ఇది కీలక వేదికగా నిలుస్తోందని సీఎం పేర్కొన్నారు. అలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు ఉంటే వెంటనే విరమించుకోవాలని అధికారులను హెచ్చరించారు. స్టార్టప్‌లకు అనుకూలమైన వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read:GHMC విభజనకు కౌంట్‌డౌన్ స్టార్ట్

