OTT:ఛాంపియన్ ఓటీటీ డేట్ ఫిక్స్‌

5
- Advertisement -

యువ నటుడు రోషన్ మేకా (సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు) తాజాగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఛాంపియన్ . క్రీడా , స్వాతంత్ర్యనంతర భారతదేశ నేపథ్యంలో సాగుతూ, నిజాం పాలనలోని రజాకార్ వ్యవస్థను ప్రతిబింబిస్తుంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని, సినీ బృందం చేసిన నిజాయితీగల ప్రయత్నంగా ప్రశంసించారు.

తాజా సమాచారం ప్రకారం, ఛాంపియన్ చిత్రం జనవరి 29 (గురువారం) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. డిజిటల్ ప్రీమియర్ తేదీని నెట్‌ఫ్లిక్స్ తమ క్యాటలాగ్‌లో ఇప్పటికే అప్‌డేట్ చేసింది. అయితే డబ్బింగ్ వెర్షన్లపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఈ సినిమాకు ఐదు వారాల OTT విండో ఉన్నట్లు సమాచారం. ఛాంపియన్ సినిమాతో ప్రముఖ మలయాళ నటీమణి అనస్వర రాజన్ టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్లపై ప్రియాంక దత్, జీకే మోహన్, జెమినీ కిరణ్ నిర్మించగా, జీ స్టూడియోస్ ప్రెజెంట్ చేసింది. నందమూరి కళ్యాణ చక్రవర్తి, మురళీ శర్మ, సంతోష్ ప్రతాప్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

Also Read:GHMC విభజనకు కౌంట్‌డౌన్ స్టార్ట్

- Advertisement -