భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘోర ఓటమిని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ జాక్ ఫౌల్క్స్‌కు మర్చిపోలేని రోజు ఎదురైంది. మూడు ఓవర్లలోనే 67 పరుగులు ఇవ్వడంతో ఆయన ఖాతాలో ఓ అవాంఛిత రికార్డు నమోదైంది.
జనవరి 23న రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుతమైన విజయం సాధించింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్‌లతో భారత్ ఈ మ్యాచ్‌ను ఏడు వికెట్ల తేడాతో గెలుచుకుంది.
భారత్ రెండో టీ20ను గెలిచినా, ఈ మ్యాచ్‌లో ప్రధానంగా చర్చకు వచ్చినది మాత్రం జాక్ ఫౌల్క్స్ ప్రదర్శనే. బౌలింగ్‌లో మూడు ఓవర్లు వేసిన ఫౌల్క్స్ ఏకంగా 67 పరుగులు ఇచ్చాడు. దీంతో, పూర్తి సభ్య దేశాల (ఫుల్ మెంబర్ నేషన్స్) మధ్య జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఒకే స్పెల్‌లో తొలి మూడు ఓవర్లలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా ఫౌల్క్స్ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు ఇంతకుముందు ఐర్లాండ్‌కు చెందిన లియామ్ మెకార్తీ పేరిట ఉండేది. ఆయన 2025లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగులు ఇచ్చాడు.
Also Read:GHMC విభజనకు కౌంట్‌డౌన్ స్టార్ట్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 208 పరుగులు చేసింది.209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

