మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి

5
- Advertisement -

ఈ రోజు హైదరాబాద్‌లోని హరీష్ రావు నివాసంలో సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్‌చెరు నియోజకవర్గాలకు చెందిన పలువురు కీలక నాయకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మాజీ మంత్రి హరీష్ రావు.

ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో పట్టణ ప్రగతి ద్వారా ప్రతినెలా నిధులు విడుదల చేసి పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదు. దీంతో మున్సిపాలిటీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి, చెత్త ఎత్తడానికి కూడా నిధులు లేని దుస్థితి నెలకొంది. నిధుల కొరతతో పట్టణాల్లో పారిశుధ్యం లోపించింది. దోమల బెడద పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. స్ట్రీట్ లైట్లు వెలిగే పరిస్థితి లేదు. తాగునీటి సరఫరాలో కూడా కోతలు విధిస్తున్నారు. ఇస్నాపూర్, గుమ్మడిదల వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది అన్నారు.

అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా చేతులెత్తేసింది. మహిళలకు, యువతకు, రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం లేదు. దళిత బంధు, బీసీ బంధు పథకాలను పూర్తిగా పక్కన పెట్టారు. పెన్షన్ల పంపిణీలో కూడా జాప్యం జరుగుతోంది. పేదల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. కాంగ్రెస్ మోసపూరిత పాలనను ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరడం ఖాయం. సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్‌చెరుతో సహా అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది. కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరచాలి అన్నారు.

Also Read:Oscar:అందరి దృష్టి..’హోమ్‌బౌండ్’పై!

- Advertisement -