టీమిండియా అనొద్దంటూ పిటిషన్..సుప్రీం ఫైర్

5
- Advertisement -

క్రికెట్ జట్టును ‘టీం ఇండియా’గా పిలవొద్దంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటైన జట్టును ‘టీం ఇండియా’ అని సంబోధించకుండా ప్రసార భారతి (దూరదర్శన్)కి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ఇలాంటి పిటిషన్లతో కోర్టులపై అనవసర భారం మోపవద్దని పిటిషనర్‌ను చురకలంటించింది.

దేశంలో క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాకుండా కోట్లాది ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశమని కోర్టు వ్యాఖ్యానించింది. బీసీసీఐ ఆధ్వర్యంలో ఆడుతున్న జట్టు దేశాన్ని ప్రతినిధ్యం వహిస్తుందని, దాన్ని ‘టీం ఇండియా’గా పిలవడంలో ఎలాంటి చట్టపరమైన సమస్య లేదని స్పష్టం చేసింది. ప్రజలకు సంబంధించిన ప్రాధాన్యమైన అంశాలపై కోర్టులు సమయం వెచ్చించాల్సి ఉంటుందని, ఇలాంటి అర్థంలేని పిటిషన్లు న్యాయవ్యవస్థ పనితీరుకు ఆటంకం కలిగిస్తాయని అసహనం వ్యక్తం చేసింది.

ప్రజా ప్రయోజనం లేని పిటిషన్లను ప్రోత్సహించబోమని కోర్టు తేల్చిచెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసే ముందు బాధ్యతతో ఆలోచించాలని పిటిషనర్‌కు సూచించింది.

Also Read:Oscar:అందరి దృష్టి..’హోమ్‌బౌండ్’పై!

- Advertisement -