సీపీఐ జాతీయ నేత నారాయణ ఖమ్మం జిల్లాలో పలు వైన్ షాపులను సందర్శించి అక్కడ విక్రయిస్తున్న మద్యం బాటిళ్లను పరిశీలించారు. మద్యం ధరలు, ఎమ్మార్పీ అమలు పరిస్థితులు, అక్రమ వసూళ్లపై ఆయన స్వయంగా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గత ప్రభుత్వాల కంటే ప్రస్తుత ప్రభుత్వాలే మద్యం అమ్మకాల ద్వారా మరింత ఆదాయం సంపాదించాలని చూస్తున్నాయని నారాయణ ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం, కుటుంబాల భవితవ్యాన్ని పట్టించుకోకుండా లిక్కర్‌ను ఆదాయ వనరుగా మార్చారని మండిపడ్డారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు ఇష్టానుసారంగా కొనసాగుతున్నా, అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.
Also Read:ఓం శాంతి శాంతి శాంతిః.. ఫన్ డ్రామా!
బెల్ట్ షాపుల్లో ఎమ్మార్పీకి మించి రూ.25 నుంచి రూ.50 వరకు అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలను వెంటనే అరికట్టాలని, మద్యం విధానంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.

