దావోస్ వేదికగా జరుగుతున్న #WorldEconomicForum2026లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ ఇనిషియేటివ్స్ ఉపాధ్యక్షురాలు కాలిస్టా రెడ్మెండ్తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి ఏఐ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా పలు అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
ఏపీలో స్టార్టప్‌ల ప్రోత్సాహం, యువతకు ఏఐ ఆధారిత నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి ఎన్‌విడియా సిద్ధంగా ఉందని కాలిస్టా రెడ్మెండ్ ముఖ్యమంత్రికి వివరించారు. ఏఐ ఎకోసిస్టమ్ నిర్మాణంలో విద్య, పరిశ్రమ, పరిశోధన రంగాలను సమన్వయం చేయాలన్న ఆలోచనపై ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.
అమరావతిలో దేశంలోనే తొలి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. ఇది భవిష్యత్ టెక్నాలజీలకు అవసరమైన మానవ వనరులను తయారు చేసే కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు.
అలాగే రాష్ట్రంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు, హార్డ్‌వేర్ తయారీ యూనిట్ స్థాపన, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో భాగస్వామ్యం వంటి అంశాలపై ఎన్‌విడియా ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ సమావేశం ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ ఆధారిత అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
Also Read:‘నారీ నారీ నడుమ మురారి’..ఆనందాన్ని ఇచ్చింది

