రివ్యూ : రెండు రెళ్ళ ఆరు

290
Review Rendu Rellu Aaru
- Advertisement -

‘వారాహి చలన చిత్రం’ బ్యానర్లో వచ్చే సినిమాలంటే బాగుంటాయనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఈ బ్యానర్ తమ సొంత సినిమాలనే  చిన్న సినిమాల్ని కూడా రిలీజ్ చేస్తుంది. ఇప్పుడలా వారాహి బ్యానర్ ద్వారా విడుదలకానున్న చిత్రమే ఈ ‘రెండు రెళ్ళ ఆరు’. దర్శకుడు నందు మల్లెల దర్శకత్వంలో  విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది…?ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా చూద్దాం…

కథ:

రాజు (నరేష్‌), రావు (రవి కాలే) మధ్యతరగతి తండ్రులు. ఇద్దరి భార్యలూ ఒకేసారి ఒకే ఆసుపత్రిలో కాన్పు కోసం వస్తారు. రాజుకి మగబిడ్డ (మాధవ్‌) రావుకి ఆడబిడ్డ (మేఘన) పుడతారు. అయితే.. పుట్టిన పిల్లలకు విచిత్రమైన జబ్బు ఉందని చెబుతారు డాక్టర్లు. ఈ క్రమంలో రాజు, రావు తమ బిడ్డలను మార్చేసుకుందాని ప్రతి పాదనకు వచ్చి మాధవ్‌, మేఘనలను పరస్పరం మార్చుకొంటారు. ఎదురెదురు ఇంట్లో అద్దెకు దిగిన మాధవ్‌, మేఘనలు తిట్టుకొంటూ కొట్టుకొంటూ పెరుగుతారు. అయితే అనుకోకుండా వాళ్ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ ప్రేమని తుంచేయాలని రాజు, రావులు ప్రయత్నిస్తారు. మరి వాళ్ల ప్రయత్నం ఫలించిందా?చివరికి కథ ఎలా సుఖాంతం అయిందనేది తెరమీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,కథనం, వినోదం, సంగీతం, భావోద్వేగాలు. హీరో,హీరోయిన్లు ఇద్దరు కొత్తవారైన తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్ మహిమ చాలా సహజంగా కనిపించింది.  హీరో హీరోయిన్లు ఒకరి ఇంట్లో వేరొకరు పెరగడం అనేది కాస్త కొత్తగా అనిపించింది. అంతేగాక అందుకు కారణమైన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో వాళ్ళ తండ్రులు తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగానే కాక వాస్తవానికి చాలా దగ్గరగా కూడా ఉంటుంది. తండ్రులుగా నరేష్, రవి కాలెల నటన చాలా బాగుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించారు. సెకండాఫ్‌లో తాగుబోతు రమేష్ కామెడీ బాగా పండింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మైనస్ పాయింట్స్ అక్కడక్కడ స్లో నేరేషన్, సుదీర్ఘంగా సాగిక పతాక సన్నివేశాలు. హీరో, హీరోయిన్ల మధ్య లవ్, ఎమోషనల్ ట్రాక్స్ పండలేదు. పాటలు సన్నివేశాలకు తగ్గట్లుగా సెట్ అవలేదు.   సినిమా మొత్తం చూస్తే దర్శకుడు తన లోపల ఉన్న ఎమోషన్ ను పాత్రల మాటల ద్వారా వ్యక్తపరచగలుగుతున్నాడు తప్ప పాత్రల నటనలో, సన్నివేశాల చిత్రీకరణలో బయటపెట్టలేకపోయాడని స్పష్టంగా అర్థమైంది.

సాంకేతిక విభాగం:

ఓ కొత్త దర్శకుడు ఇలాంటి పాయింట్‌ని ఎంచుకుని సినిమా చేయడం చాలా కష్టం. కానీ అలాంటి ప్రయత్నం చేసిన దర్శకుడిని అంతా అభినందించాల్సిందే. కామెడీకి డోకా లేకుండా తాను అనుకున్న పాయింట్‌ని బలంగా చెప్పగలిగాడు. తొలి సినిమా అయినా  క‌న్విన్సింగ్‌గా తీయగలిగాడు..డైలాగులు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. విజయ్ సంగీతం ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ ఫర్వా లేదనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

వారాహి చలన చిత్రం బ్యానర్ ద్వారా  విడుదలైన చిన్న సినిమా ‘రెండు రెళ్ళ ఆరు’ . కథ, కథనం, సెకండాఫ్ కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్ కాగా స్లో నేరేషన్, పతాక సన్నివేశాలు మైనస్ పాయింట్స్ . ఓవరల్‌గా చిన్న సినిమాల్లో బెస్ట్ అనిపించే రెండు రెళ్ళ ఆరు.

విడుదల తేదీ : 08/07/2017
రేటింగ్ : 3/5
నటీనటులు : అనిల్, మహిమ
సంగీతం : విజయ్ బుల్గేనిన్
నిర్మాత : ప్రదీప్ చంద్ర, మోహన్ అందే
దర్శకత్వం : నందు మల్లెల

- Advertisement -