సవాళ్లంటే ఇష్టం…

202
Junior NTR's Telugu Bigg Boss Latest update
- Advertisement -

నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టమని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. బిగ్ బాస్ లాంఛింగ్ కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ తాను బిగ్ బాస్ కాదని బాస్ మాత్రమేనని తెలిపారు.  బిగ్ బాస్ కంటెస్ట్‌లు ఎవరో తనకు తెలియదని నిర్వాహకులకే తెలుసన్నారు. కంటెస్ట్‌లు ఎవరో తెలుసుకోవాలన్న ఆతృత తనకుందన్నారు.

నాకు టీవీల్లో నటించడం రాదు, ఎలా మాట్లాడాలో కూడా పెద్దగా తెలియదు. ఇప్పుడు ఈ సరికొత్త సవాలును స్వీకరించాను. స్టార్ మా తనను సంప్రదించినప్పుడు ఆలోచించాను. దీని నుంచి నేర్చుకునేందుకు ఎన్నో అవకాశాలుంటాయని భావించి,  ఈ ఆఫర్ ను అంగీకరించానని జూనియర్  తెలిపారు. ఈ ప్రయత్నం విజయవంతమవుతుదన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని చెప్పాడు.

ఈ ఆఫర్ అంగీకరించేందుకు రఘు కారణమని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. హిందీ బిగ్ బాస్ చూడలేదు కానీ తన కజిన్ సిస్టర్ బాగా చూస్తుందని చెప్పాడు. ఒకరోజు సల్మాన్ కంటెస్టెంట్స్ ని తిట్టేశాడని తన కజిన్ చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఈ షో చూడడమే కానీ, ప్రత్యేకంగా చూసిందేదీ లేదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. బిగ్ బాస్‌ షో సక్సెస్ ఫుల్ షో అని అందుకే షోకి ఇంత హైప్ వచ్చిందని తన వల్లే షోకి క్రేజ్ వచ్చిందని తాను విశ్వసించనని తెలిపారు.  ఈ నెల 16న షో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -