జర్నలిస్టుల అరెస్టులపై హరీష్‌ రావు..

8
- Advertisement -

రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న వరుస అరెస్టుల అంశంపై మాజీ మంత్రి, సీనియర్ నేత హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన నేరుగా రాష్ట్ర డీజీపీతో ఫోన్‌లో మాట్లాడి తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. పండుగ వేళ, అర్ధరాత్రి సమయంలో జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

చట్టప్రకారం అనుసరించాల్సిన ప్రొసీజర్ పాటించకుండా, ముందుగా నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టులు చేస్తారని హరీశ్ రావు నిలదీశారు. జర్నలిస్టులు క్రిమినల్స్ కూడా కాదని, టెర్రరిస్టులు అయితే మరీ కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా గుర్తింపు పొందిన జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరించడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.

పండుగ రోజుల్లో జర్నలిస్టులను అరెస్టు చేయడం వల్ల వారి కుటుంబాలు తీవ్ర మానసిక వేదనకు గురవుతాయని హరీశ్ రావు తెలిపారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు.

అరెస్టులు చేయాల్సిన అవసరం ఉంటే చట్టబద్ధమైన మార్గాలు ఉన్నాయని, కానీ బలవంతపు చర్యలు సరికాదని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అరెస్టు చేసిన జర్నలిస్టులందరినీ వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా మీడియాకు స్వేచ్ఛ కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.

Also Read:దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -