చాలా కాలం తరువాత ఒక మంచి కథను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు తేజ. రానా, కాజల్ జంటగా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాను తెరకెక్కించాడు. ఓ సాధారణ యువకుడు అనేక అవరోధాలను అధిగమిస్తూ ముఖ్యమంత్రిగా ఎదిగే ఆసక్తికరమైన రాజకీయ అంశాలతో ఈ సినిమాను రూపోందించాడు. ఈ సినిమాను ఆగస్టు 4వ తేదీన విడుదల చేసే అవకాశాలు వున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఆగస్టు 11న విడుదల చేయనున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమా పోస్టర్స్ కి .. టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో, సినిమాకి కూడా మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో తేజ తెరకెక్కించిన ఏ చిత్రానికి రానంత హైప్.. నేనే రాజు నేనే మంత్రిపై క్రియేట్ అయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచేసింది. వీటిని మరింతగా పెంచేందుకు తేజ రకరకాల టెక్నిక్స్ అవలంబిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి.. కథ కథనాలతో పాటు డైలాగ్స్ హైలైట్ అనే సంగతి అర్ధమయిపోగా.. ఇప్పుడు కాజల్ తో రానా రొమాన్స్ ను కూడా ప్రత్యేకించి ప్రొజెక్ట్ చేస్తున్నారు. తాజాగా రానా-కాజల్ ఇద్దరి పోస్టర్ చూస్తుంటే.. ఈ జంట మధ్య రొమాన్స్ ఏ స్థాయిలో పండించారో అర్ధమవుతుంది.
తేజ తెరకెక్కించిన లక్ష్మీ కళ్యాణం మూవీతో సినీ అరంగేట్రం చేసిన కాజల్.. తన తొలి దర్శకుడికి బ్రేక్ ఇచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించిందనే సంగతి అర్ధమవుతోంది. తమ జంట మధ్య ఉన్న ఆన్ స్క్రీన్ అనుబంధాన్ని ఒక్క పోస్టర్ తోనే చూపించేశారంటే.. కాజల్ -రానాలు ఎంత క్లోజ్ గా ఉన్నారో చెప్పచ్చు. చీరకట్టులో కూడా ఇంత అందంగా కనిపించగలగడం కాజల్ కి మాత్రమే సాధ్యం.మరి సోలోగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న రానాకీ, ఈ సినిమా ఆ ముచ్చట తీరుస్తుందేమో చూడాలి.