విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ సినిమా నిర్మాతలు KVN ప్రొడక్షన్స్ LLP, ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సర్టిఫికేషన్ ప్రక్రియను నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తాత్కాలిక స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
2026 జనవరి 9న మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను నిర్మాతలు తమ పిటిషన్‌లో సవాలు చేశారు. అంతకుముందు సింగిల్ బెంచ్, ఈ సినిమాకు U/A 16+ సర్టిఫికేట్ ఇవ్వాలని CBFCను ఆదేశించగా, ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ డివిజన్ బెంచ్ సర్టిఫికేషన్ ప్రక్రియపై స్టే విధించింది.
జనవరి 9 తేదీన మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని ఎక్స్‌పార్టే ఇంటరిమ్ స్టే లేదా అడ్ఇంటరిమ్ స్టే ఇవ్వాలని నిర్మాతలు సుప్రీంకోర్టును కోరారు. అవసరమైతే న్యాయస్థానం తగిన ఇతర ఉపశమనాలు ఇవ్వాలని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. 09.01.2026న మద్రాస్ హైకోర్టు (C.M.P No. 821 of 2026 in W.A. No. 94 of 2026)లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని, అలాగే గౌరవనీయ న్యాయస్థానం తగినదిగా భావించే ఇతర ఉత్తర్వులు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము అని తెలిపారు.
ఇదిలా ఉండగా, CBFC కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదని కోరుతూ దాఖలు చేసింది. తొలుత మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్, ఈ చిత్రానికి U/A 16+ రేటింగ్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది.తరువాత CBFC ఆ ఉత్తర్వులను సవాలు చేయడంతో, డివిజన్ బెంచ్ సర్టిఫికేషన్ ప్రక్రియను నిలిపివేసింది. అలాగే సినిమాలోని సాయుధ దళాలకు సంబంధించిన సన్నివేశాలపై నిపుణుల అభిప్రాయం అవసరం అని CBFC డివిజన్ బెంచ్ ముందు వాదించింది.
Also Read:Delhi AQI:మూడేళ్లలో ఇదే తొలిసారి!

