‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’..ట్విట్టర్ రివ్యూ

8
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ యూకే, అమెరికాలో జరిగిన ప్రీమియర్ షోలతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై సోషల్ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్‌లో మంచి స్పందన కనిపిస్తోంది. కథ సింపుల్‌గా ఉన్నప్పటికీ, రవితేజ ఎనర్జీ, టైమింగ్‌, కామెడీ ట్రాక్ బాగా వర్క్ అయ్యాయని ఎన్ఆర్ఐ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో “రవితేజ ఈజ్ బ్యాక్” అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

రవితేజ కెరీర్‌లో తొలిసారిగా మాస్ ఇమేజ్‌ను పక్కన పెట్టి, పూర్తిగా వినోదానికి ప్రాధాన్యం ఇచ్చి చేసిన సినిమా ఇదనే చెప్పాలి. ఇప్పటికే సంక్రాంతి బరిలో విడుదలైన ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు ఉన్నాయి. యూకే, అమెరికాలో ప్రీమియర్ షోలు పూర్తవడంతో అక్కడి ప్రేక్షకుల రివ్యూలు ఆసక్తికరంగా మారాయి.

ఒక నెటిజన్ ట్వీట్‌లో, “ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా అనిపించినా, కామెడీ చాలా చోట్ల వర్క్ అయింది. ఇటీవల రవితేజ సినిమాల్లో ఇది బెటర్ ఫస్ట్ హాఫ్” అని పేర్కొన్నాడు. మరో అభిమాని మాత్రం, “ఆ ఎనర్జీ, ఆ టైమింగ్ అదిరిపోయాయి. #BMWలో కామెడీ నెక్స్ట్ లెవెల్. ఇది పక్కా సంక్రాంతి విన్నర్” అంటూ ప్రశంసలు కురిపించాడు.

మరొక రివ్యూలో, “ఫస్ట్ హాఫ్ ఓకే. సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ఫన్ రైడ్. రవితేజ ట్రేడ్‌మార్క్ ఎనర్జీ సినిమాకు పెద్ద ప్లస్” అని అభిప్రాయం వ్యక్తమైంది. మరో నెటిజన్ అయితే, “పక్కా పండగ బొమ్మ. 2 గంటల 20 నిమిషాల పాటు నవ్వుల రైడ్. రవితేజ వన్ మ్యాన్ షో” అంటూ ⭐⭐⭐/5 రేటింగ్ ఇచ్చాడు.

Also Read:KTR:కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు

కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం, కామెడీ టైమింగ్ సినిమాకు అదనపు బలంగా మారాయి. కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా, వినోదం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా డీసెంట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 13 తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ రిస్పాన్స్ ఎలా ఉంటుందన్నదే తుది ఫలితాన్ని నిర్ణయించనుంది.

- Advertisement -