మంచిగ సదువుకోండి..బిడ్డ !

5
- Advertisement -

విద్యుత్ ప్రమాదంలో ఇటీవల మరణించిన ఎర్రవెల్లి గ్రామ నివాసి పేద రైతు చిన్రాజు సత్తయ్య కుమారుడు, స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో బి టెక్ చదువుతున్న నవీన్, అదే గ్రామానికి చెందిన, ప్రమాద వశాత్తూ కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన,మరో పేద రైతు పెద్దోళ్ల సాయిలు కొడుకు, బి టెక్ చదువుతున్న అజయ్., లను చేరదీసి వారి ఇంజనీరింగ్ చదువు పూర్తికాలపు ఫీజులను బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చెల్లించారు. వారికి అవసరమయ్యే పుస్తకాలు, కంప్యూటర్ ల కోసం కూడా ఆర్థిక సాయం అందించారు.

ఈ మేరకు వారికి విడి విడి గా చెక్కులు అందించారు. “కష్టపడి మంచిగ చదువుకోండి బిడ్డా.. మీరు కష్టపడి గొప్ప స్థాయిని చేరుకోవాలె. మీరు.. ఫీజులకోసం భయపడొద్దు. యే సమస్య వచ్చినా నేనున్న..” అంటూ భరోసా నిస్తూ కేసీఆర్ ఆశీర్వదించారు.కాగా.. విద్యుత్ ప్రమాదంలో మరణించిన చిన్రాజు సత్తయ్య కుటుంబానికి సంబంధిత విద్యుత్ శాఖ నుంచి చట్టపరంగా అందే ఆర్థిక తదితర సాయం గురించి పర్యవేక్షించి వారికి న్యాయం జరిగేలా చూడాలని తన వ్యక్తిగత కార్యదర్శి నాగేందర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు.

కాగా… కుటుంబ పెద్దను కోల్పోయిన తమను గుర్తించి, ఆదరించి, ఆర్థికంగా ఆదుకుని, తమ పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన కేసీఆర్ గారికి, పిల్లల తల్లులు చేతులెత్తి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. తమ చదువుకోసం భరోసాగా నిలిచిన కేసీఆర్ గారికి ఎర్రవెల్లి గ్రామానికి చెందిన పేద విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:రేవంత్‌కి గ్రూప్ 1 ఆఫీసర్స్ విజ్ఞప్తి

- Advertisement -