కేసీఆర్ దార్శనికతకు మరో నిదర్శనం

7
- Advertisement -

తెలంగాణ విద్యుత్ రంగంలో మరో చారిత్రక ఘట్టం నమోదైంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో నాలుగో యూనిట్ కమర్షియల్ ఆపరేషన్ డేట్ (COD)ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో విద్యుత్ రంగంలో కేసీఆర్ కలలు సాకారమైన శుభదినంగా ఇది నిలిచింది.

సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నాలుగో యూనిట్ 800 మెగావాట్ల సామర్థ్యంతో వాణిజ్య విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ యూనిట్ అందుబాటులోకి రావడంతో యాదాద్రి ప్లాంట్‌లో మొత్తం 3200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం రాష్ట్రానికి అందుబాటులోకి వచ్చింది. ఇది తెలంగాణ విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది.

దేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యం పెరగడమే కాకుండా, పర్యావరణానికి అనుకూలంగా కాలుష్యాన్ని తగ్గించే చర్యలు కూడా అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో విద్యుత్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న తెలంగాణ, ఇప్పుడు విద్యుత్ మిగులు రాష్ట్రంగా నిలవడానికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రధాన ఆధారంగా మారింది.

కేసీఆర్ హయాంలో విద్యుత్ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత వల్లే ఇలాంటి భారీ ప్రాజెక్టులు సాధ్యమయ్యాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, పరిశ్రమలకు నిరంతర సరఫరా లక్ష్యంగా తీసుకున్న విధానాలు ఫలితాలనిస్తున్నాయని అన్నారు. యాదాద్రి నాలుగో యూనిట్ ప్రారంభం తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో మరో మైలురాయిగా నిలిచింది.

Also Read:PPP ఈజ్ బిగ్గెస్ట్ స్కాం ఆఫ్ ది డికేడ్!

- Advertisement -