యశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’ టీజర్‌ను 2026 జనవరి 8న విడుదల చేశారు. ఇది యశ్ 40వ పుట్టినరోజు సందర్భంగా రావడం విశేషం. అలాగే, ఈ చిత్రాన్ని మార్చి 19, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ధృవీకరించారు.
యశ్ నటించిన అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘టాక్సిక్ – ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ ప్రకటనను సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించడంతో పాటు టీజర్ విడుదల సమయాన్ని కూడా తెలియజేశారు. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కే నారాయణ, యశ్ కలిసి నిర్మిస్తున్నారు.
టీజర్ పూర్తిగా యాక్షన్‌తో నిండిపోయి ఉంది. ఒక్కసారిగా చెలరేగిన హింసతో టీజర్ మొదలవుతుంది. గన్ ఫైర్‌తో నిశ్శబ్దం చెదిరిపోతుంది, చుట్టూ శవాలు పడిపోతాయి. ఆ పొగమంచు మధ్య నుంచి యశ్ పోషిస్తున్న రాయా పాత్ర ప్రవేశిస్తుంది. పూర్తి నియంత్రణలో, ప్రశాంతంగా నిలిచిన రాయా లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
యూట్యూబ్‌లో విడుదలైన టీజర్‌కు ఇచ్చిన లాగ్‌లైన్ ఇలా ఉంది:“మీ ప్రమాదాన్ని దగ్గరగా చూడండి – రాకింగ్ స్టార్ యశ్‌ను రాయాగా పరిచయం చేస్తున్నాం. ‘టాక్సిక్ – ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ప్రపంచవ్యాప్తంగా 19-03-2026న థియేటర్లలో. #DaddyIsHome #ToxicTheMovie.”
టీజర్ విడుదలైన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో స్పందించారు. ఒకరు “పూర్తి హాలీవుడ్ వైబ్స్” అని వ్యాఖ్యానించగా, మరోరు “సాండల్‌వుడ్ నుంచి హాలీవుడ్ ఫీల్” అంటూ ప్రశంసించారు. ఈ చిత్రం ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగల సమయంలో మార్చి 19, 2026న విడుదల కానుంది.
Also Read:‘జన నాయగన్’ విడుదల వాయిదా

