KTR:కాంగ్రెస్ అంటేనే ‘క్రాప్ హాలిడే’

4
- Advertisement -

మంత్రి జూపల్లి కృష్ణారావు అదిలాబాదులో గత ఏడాది చాలా స్పష్టంగా చెప్పాడు అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్లో జరిగిన కొల్లాపూర్ నియోజక వర్గ చేరికల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తిరిగి వస్తుందో రాదో తెలియదు నేను కూడా గెలుస్తానో లేదో తెలియదు అన్నారు.కొల్లాపూర్ ప్రజలు మాత్రం ఇప్పటికే నిర్ణయించుకున్నారు కృష్ణారావుని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించబోమని ..ఇదే కృష్ణారావు మా పార్టీలో ఉన్నప్పుడు కెసిఆర్ గారి గురించి ఎంత గొప్పగా మాట్లాడారు అందరికీ తెలుసు అన్నారు.

అట్లాంటిది రేవంత్ రెడ్డిని సంతృప్తి పరచడానికి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ..తన మంత్రి పదవి కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డిని ఇంద్రుడు చంద్రుడు అంటున్నాడు ..అవకాశవాదంతో కాంగ్రెస్లోకి పోయిన నాయకుడు జూపల్లి కృష్ణారావు ..మంత్రి జూపల్లి కృష్ణారావు అరాచకాలను ఎదుర్కొని మరి పంచాయతీ ఎన్నికల్లో కొల్లాపూర్ లో గట్టిగా గెలిచాము అన్నారు.

కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలి అంటే మూడు ముక్కల్లో…ఎగవేతలు కూల్చివేతలు పేల్చివేతలు తప్ప చేసింది ఏమీ లేదు ..ఒకవైపు ఆరు గ్యారెంటీలను ఎగవేస్తూ…హైడ్రా వంటి అరాచక విధానాలతో ఇండ్లను కూల్చివేస్తూ…చెక్ డాంలను పేల్చి వేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ..చెక్ డాములు కట్టేచోట పేల్చివేతలకు పాల్పడుతున్న ఏకైక దరిద్రపుగొట్టు ప్రభుత్వం ప్రపంచంలో కాంగ్రెస్ ఒకటే ఉంటుంది ..పాలమూరు ప్రాజెక్టును పండబెట్టి రైతులను తొక్కుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..కేవలం తన పాత బాస్ కి కోపం వస్తుందని ఏకైక ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి పాలమూరును పట్టించుకోవడం లేదు అన్నారు.

తెలంగాణలోని ఏ ప్రాంతం ఏ బేసిన్ లో ఉందో తెలవని ముఖ్యమంత్రితోని మాకు నీటి పాఠాలు అవసరం లేదు ..రేవంత్ రెడ్డి బాక్రానంగల్ ఎక్కడుందో కూడా తెలియని అజ్ఞాని ..నదుల గురించి నీళ్ల గురించి ప్రాజెక్టుల గురించి కనీస అవగాహన లేని రేవంత్ రెడ్డి కేసీఆర్ కి నీటి పాఠాలు చెప్తా అంటున్నారు ..కాంగ్రెస్ పార్టీ అరాచకాల నుంచి తెలంగాణను కాపాడుకోవాలి అంటే కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలి ..ఇందుకోసం పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలి ..రేపు రాబోయే మున్సిపల్ ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలలో గట్టిగా కొట్లాడి గెలవాలి అన్నారు. రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి చాలా దారుణంగా తయారయింది ..వ్యవసాయ దారులకు ఇచ్చే అన్ని పథకాలను కాంగ్రెస్ ఆపివేసింది అన్నారు. మేము 11 సార్లు రైతు భరోసా ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సారి ఇచ్చి చేతులు దులుపుకుంది ..ఈరోజు యూరియా గురించి అడిగితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నారు.

Also Read:‘జన నాయగన్’ విడుదల వాయిదా

షాపుల్లో లేని యూరియాను మొబైల్ యాప్స్ తో ఇస్తామని చెప్తుంది ..కొత్తగా యూరియా కార్డ్ అంటూ నాటకం మొదలుపెట్టింది ..రైతన్నలకు యూరియా దొరకక లైన్లో నిలబడి యుద్ధాలు చేసుకునే పరిస్థితి వచ్చింది ..చెప్పులు లైన్లో పెట్టి కుటుంబమంతా ఒక్క బస్తా యూరియా కోసం నిలబడుతున్నది ..గ్యారంటీ కార్డులకే దిక్కులేదు కొత్తగా యూరియా కార్డుతో ఇచ్చి కాంగ్రెస్ ఏం చేస్తుంది ..రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలు క్రాప్ హాలిడేలు ప్రారంభమయ్యాయి ..గతంలో మా ప్రభుత్వం లో యూరియా కోసం కుస్తీ లేదు విత్తనాల కోసం పోటీ లేదు కరెంటు కష్టాలు లేవు క్రాప్ హాలిడేలు లేవు అన్నారు.

- Advertisement -