తన అక్రమ సంపాదనకు అడ్డువస్తున్నారని కడుపులో కొండంత విషం పెట్టుకున్న రేవంత్ అని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డికి నరనరాన విషం తప్ప మూసీని ప్రక్షాళన చేయాలన్న విజన్ ఏమాత్రం లేదని మండిపడ్డారు. అసెంబ్లీలో మూసీపై రేవంత్ అబద్దాలను ఎండగట్టారు కేటిఅర్. కలుషితమైన మూసీ కన్నా ముఖ్యమంత్రి ఉపయోగించే భాష నుంచే ఎక్కువ కంపు కొడుతోందని ధ్వజమెత్తారు.
తన అక్రమ సంపాదనకు అడ్డువస్తున్నారని తమ పార్టీపైన, మూసీని వ్యతిరేఖిస్తున్న ప్రజలపైన కడుపులో కొండంత విషం పెట్టుకున్న రేవంత్.. డీపీఆర్ సిద్ధం కావడానికి ఇంకా ఏడాది పడుతుందని అంటున్న ముఖ్యమంత్రి ముందే లక్షన్నకోట్లు వ్యయం ఏట్లా చెప్పారు… డీపీఆర్ కూడా సిద్ధం కాకముందే బుల్‌డోజర్లతో పేదల ఇళ్లను ఎందుకు కూల్చినట్టో సమాధానం చెప్పాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
మూసీ లూటిఫికేషన్ పేరిట భారీ దోపిడీ కోసం బ్లాక్ లిస్టులో పెట్టిన మెయిన్ హార్ట్ అనే కంపెనీకి కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం చేశారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన కంపెనీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారని సూటి ప్రశ్న వేశారు. సమైక్యరాష్ట్రంలో మూసీని కలుషితం చేసిందే 60 సంవత్సరాలపాటు పాలించిన కాంగ్రెస్ టిడిపి ప్రభుత్వాలు…మూసీని ఆనుకుని నివసించే లక్ష మందికి పైగా ప్రజల ఇళ్లను కూల్చి త్వరలోనే వారిని రోడ్డున పడేస్తామని అధికారికంగా ప్రకటించారన్నారు.
దశాబ్దాలపాటు నల్గొండ జిల్లా ప్రజలను మూసీ మురికితో ఇబ్బందుల పాలుచేసిన పాపం కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ వంటి ప్రతిష్ఠాత్మక పథకంతో నల్గొండలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కుండబద్దలు …గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి ముందుగా అవి కాళేశ్వరం నీళ్లా కాదా చెప్పి ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. పరిపాలన అంటే రియల్ ఎస్టేట్ దందా మాత్రమే అని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు…బీఆర్ఎస్ హయాంలోనే అతితక్కువ ఖర్చుతో మూసీ పునరుజ్జీవం కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.ఆసక్తి చూపిన 9 కంపెనీలు అన్నిరకాల డిజైన్లు సిద్ధం చేశాయని, వడ్డించిన విస్తరి లాంటి ప్రాజెక్టును పక్కనపెట్టి మళ్లీ కమిషన్ల కోసం కొత్త నాటకానికి తెరలేపారని… దాదాపు 16 వేల కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ అంచనాలను లక్షన్నర కోట్లకు పెంచి అతిపెద్ద కుంభకోణానికి తెరతీశారు అన్నారు.1100 కోట్లతో కొండ పోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు కాళేశ్వరం నీళ్లను తరలించాలని ప్రణాళికలు రచిస్తే, ఇప్పుడు అంచనాలు అమాంతం పెంచి దండుకోవాలని చూస్తున్నారు అన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డును కనెక్ట్ చేసేలా ఎక్స్ ప్రెస్ వే ప్రణాళిక కూడా గతంలోనే సిద్ధంచేశామన్నారు. మూసీలోకి చేరే 2000 ఎంఎంల్డీ మురుగునీటి శుద్ధి కోసం 36 ఎస్టీపీల నిర్మాణం పూర్తిచేశాం అన్నారు.
Also Read:MSG:చిరు ఫ్యాన్స్‌కు ట్రీట్

