సంపత్ నందితో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హీరో దుల్కర్ సల్మాన్. ఈ ఆసక్తికర ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుందని సమాచారం.
గతంలో రచ్చ సినిమాతో భారీ హిట్ అందించిన సంపత్ నంది, ఇటీవలి కాలంలో వరుస బాక్సాఫీస్ పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పరిస్థితులన్నింటిని పక్కనపెట్టి, బలమైన కథతో పాటు తాజా విజన్‌తో దుల్కర్ సల్మాన్‌ను ఆయన ఒప్పించినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కథ వినిపించిన సమయంలో సంపత్ నంది అందించిన నేరేషన్, కథను ప్రదర్శించే విధానం దుల్కర్‌ను బాగా ఆకట్టుకున్నాయట. ప్రత్యేకమైన ట్రీట్మెంట్, కొత్తదనం ఉన్న కథ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై దుల్కర్ ఆసక్తి చూపినట్లు టాక్.
ఇప్పటివరకు ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
Also Read:‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’..అప్‌డేట్

