ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకుంటున్న లక్షలాది మంది లబ్ధిదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త ఏడాది మీ జీవితాల్లో మరింత మంచిని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాం. నూతన సంవత్సరాన్ని ఆనందంగా ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈసారి ఒక రోజు ముందుగానే పింఛను సొమ్మును అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లపై అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, ఇప్పటికే రూ.50 వేల కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఇది పేదలు, వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం అన్నారు.
డిసెంబర్ నెల పింఛన్ల కోసం మొత్తం 63.12 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,743 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు అందించాల్సి ఉండగా, నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేకంగా ఒక రోజు ముందే అంటే 31వ తేదీననే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు.
పేదల జీవితాల్లో భద్రత, నమ్మకం కల్పించే ఈ పింఛను పంపిణీ కార్యక్రమం ప్రభుత్వానికి ఎంతో సంతృప్తిని ఇచ్చే సంక్షేమ పథకమని పేర్కొంటూ, ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులందరికీ మరోసారి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.
Also Read:నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

