రెండు పార్ట్‌లుగా ఎన్టీఆర్ బయోపిక్..!

219
Biopic on Ntr Life History
- Advertisement -

తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు ఎన్టీఆర్. సినిమా రంగంలోనే కాదు రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా మిగిలిపోయారు. తాజాగా నందమూరి తారక రామారావు జీవితంపై బయోపిక్ తీయనున్నట్లు దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అంతేగాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ శత్రువులు ఎవరు, కుట్రలు చేసింది ఎవరు, కుట్రల వెనకున్న అసలు కుట్రలు ఏంటో తన సినిమాలో చూపిస్తానని చెప్పాడు వర్మ. ఇందుకు సంబంధించి వర్మ ఓ పాటను కూడా విడుదల చేశాడు. వర్మ చేసిన ప్రకటనలో బాలకృష్ణ హీరో అన్న మాట కానీ, నిర్మాత ఎవరన్న మాట కానీ లేదు.

ఎన్టీఆర్ బయోపిక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు? ఎవరు నిర్మిస్తారు? అన్నది పక్కన పెడితే, ప్రస్తుతం దాని కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్ తయారవుతున్న సంగతి మాత్రం వాస్తవం. ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా తీస్తే ఎలా వుంటుంది అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Biopic on Ntr Life History
ఎన్టీఆర్ నట జీవితంతో ప్రారంభమై, ముఖ్యమంత్రి పదవీ స్వీకారంతో తొలిభాగం ముగియనుందట. ఇక కీలకమైన రెండవ భాగంలో ఎన్టీఆర్‌ రాజకీయ జీవితంలో జరిగిన కీలక పరిణామాలను ఆవిష్కరించనున్నారట.

తొలుత బాలకృష్ణ…ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని ప్రకటించగా ఈ సినిమా కేవలం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేవరకే తీయాలని భావించారట. అయితే వర్మ మాత్రం తన సినిమాలో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలతో పాటు ఎత్తు పల్లాలను చూపించాలని భావిస్తున్నారట.

దీంతో వర్మ తన సినిమా మొదలు పెట్టకుండానే పొలిటికల్ హిట్ పెంచేశాడు. ఎందుకంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గద్దె దిగే వరకు కాదు కాదు గద్దె దింపే వరకు జరిగే పరిణామాలు రెండవ పార్ట్‌లో ఉండనున్నాయనే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో రెండవ పార్ట్‌లో వర్మ చూపించే విలన్‌ ఎవరోనని టీ టౌన్‌లో పుకార్లు షికార్ చేస్తున్నాయి. మరి వర్మ ఎన్టీఆర్‌ బయోపిక్‌లో వాస్తవాలను చూపిస్తాడో లేదా రక్తచరిత్ర పార్ట్‌ 2లాగా సొ….సొ అనిపిస్తాడో వేచి చూడాలి.

- Advertisement -