కొత్త సంవత్సరం వేళ ఓటీటీల్లో అలరించేందుకు పలు చిత్రాలు రెడీగా ఉన్నాయి. అస్మి..ETV Winలోని ‘కథా సుధ’ సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ కొత్త వెబ్ ఫిల్మ్‌కు సాయి కిరణ్ సుంకోజు దర్శకత్వం వహించారు. రాజీవ్ కనకాల, స్వరూప్ సంజయ్, సుగి విజయ్ కీలక పాత్రల్లో నటించారు. ఇది ఒక సైకాలజికల్ డ్రామా కాగా, నిన్నటి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.
ఎకో..మలయాళ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి దింజిత్ అయ్యతాన్ దర్శకత్వం వహించారు. సందీప్ ప్రదీప్ ప్రధాన పాత్రలో నటించారు. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ సినిమా డిసెంబర్ 31, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.
LBW…జియో హాట్‌స్టార్‌లో విడుదలయ్యే ఈ తమిళ స్పోర్ట్స్ డ్రామాలో విక్రాంత్ ప్రధాన పాత్రలో నటించారు. గణేష్ కార్తికేయన్ దర్శకత్వం వహించారు. సమస్యలతో ఉన్న యువతను క్రికెట్ ద్వారా సరైన మార్గంలో నడిపించే మాజీ క్రికెటర్ కథగా ఈ సిరీస్ రూపొందింది. జనవరి 1, 2026న స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. తెలుగు వెర్షన్ కూడా ఉంటుంది.
హక్..హిందీ కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, యామి గౌతమ్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమా జనవరి 2, 2026న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
Also Read:KTR:ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డోర్స్ క్లోజ్
మౌగ్లీ 2025..రోషన్ కనకాల నటించిన ఈ చిత్రం, దర్శకుడు సందీప్ రాజ్‌కు తొలి థియేట్రికల్ మూవీ. మిశ్రమ స్పందనతో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా జనవరి 1, 2026న ETV Winలో OTTకి రానుంది.
స్ట్రేంజర్ థింగ్స్ S5 ఫైనాలే..ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ చివరి ఎపిసోడ్ జనవరి 1, 2026న విడుదల కానుంది. వాల్యూమ్ 2కు మిశ్రమ స్పందన రావడంతో, ముగింపు ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు వెర్షన్ అందుబాటులో ఉన్నా, అమెరికాలోలా థియేట్రికల్ రిలీజ్ ఉండదు.

