‘బాహుబలి’ ప్రయోగం సక్సెస్‌:ఇస్రో

7
- Advertisement -

‘బాహుబలి’ ప్రయోగం విజయవంతం అయిందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. భారత్ నుంచి నింగికెగసిన అతి పెద్ద రాకెట్ ఇదేనని చెప్పారు. అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి ప్రయోగం చేశాం అన్నారు.

ఈ విజయంతో గగన్యాన్ ప్రాజెక్టును మరింత ఉత్సాహంగా చేపడతాం … ఇస్రోపై అమెరికా సంస్థ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా కృషి చేస్తాం అన్నారు ఇస్రో ఛైర్మన్.

LVM3-M6 సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి ఉదయం 8.54 గంటలకు ప్రయోగం చేపట్టారు. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2ను మోసుకెళ్లింది LVM3-M6 రాకెట్. బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్ శాటిలైట్ ద్వారా నేరుగా మొబైల్ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్.

Also Read:నారి నారి నడుమ మురారి..ఎంజాయ్ చేస్తారు!

- Advertisement -