Epstein files:మళ్లీ ట్రంప్ పోటో ప్రత్యక్షం

10
- Advertisement -

జెఫ్రీ ఎప్స్టీన్‌కు సంబంధించిన విచారణలో భాగంగా ఉన్న 3 లక్షలకు పైగా రికార్డులను అమెరికా న్యాయ శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ – DOJ) శుక్రవారం రాత్రి ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఈ ఫైల్స్‌లో పలు ప్రముఖులకు సంబంధించిన ఫోటోలు, డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇందులో మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌, పాప్ స్టార్ మైకేల్ జాక్సన్‌ వంటి ప్రముఖుల పేర్లు, చిత్రాలు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో విడుదల చేసిన ఎప్స్టీన్ డాక్యుమెంట్లలో భాగంగా ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోను అమెరికా న్యాయ శాఖ తిరిగి తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. తొలుత ఆ ఫోటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత, ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వకుండా ఒకరోజు పాటు తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం ఆ ఫోటోలో ఎప్స్టీన్ బాధితులెవ్వరూ లేరని నిర్ధారించిన తర్వాతే మళ్లీ వెబ్‌సైట్‌లో పెట్టామని న్యాయ శాఖ స్పష్టం చేసింది.

న్యూయార్క్ సదర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు బాధితుల రక్షణ కోణంలో ఆ ఫోటోపై సందేహాలు వ్యక్తం చేయడంతో, అదనపు పరిశీలన కోసం తాత్కాలికంగా తొలగించామని DOJ ఒక ‘ఎక్స్’ (X) పోస్ట్‌లో తెలిపింది. సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఆ ఫోటోలో ఎప్స్టీన్ బాధితులెవ్వరూ లేరని తేలడంతో, ఎలాంటి మార్పులు లేకుండా మళ్లీ అప్‌లోడ్ చేసినట్లు పేర్కొంది.

ట్రంప్ ఫోటోను అకస్మాత్తుగా తొలగించడం తీవ్ర చర్చకు దారితీసింది. ముందస్తు సమాచారం లేకుండా ఫైళ్లను తొలగించడంపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు. సరైన వివరణ లేకపోవడంతో ప్రజల్లో గందరగోళం నెలకొని, న్యాయ శాఖపై విమర్శలు పెరిగాయి.

Also Read:శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన 3 లక్షలకు పైగా రికార్డులను DOJ విడుదల చేసింది. ఇందులో బిల్ క్లింటన్, మైకేల్ జాక్సన్, నటుడు క్రిస్ టక్కర్, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ వంటి ప్రముఖులకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. కొన్ని చిత్రాల్లో క్లింటన్ యువతులతో కలిసి పూల్‌లో ఈత కొడుతున్నట్లు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు కనిపిస్తున్నాయి. మొత్తంగా నాలుగు విడతలుగా మొదట ఈ డాక్యుమెంట్లు విడుదల కాగా, ఆ తర్వాత మరికొన్ని గంటల్లోనే మరో మూడు విడతలుగా ఫైల్స్‌ను బయటపెట్టారు. మొత్తం 3,500కు పైగా ఫైళ్లుగా, సుమారు 2.5 జీబీ పరిమాణంలో ఫోటోలు, సంబంధిత డాక్యుమెంట్లు ఈ విడుదలలో భాగంగా ఉన్నాయి.

- Advertisement -