తనూజ జర్నీ వీడియో చూశారా? అది చూస్తేనే ఆమె విన్నర్ అనిపిస్తోంది అనే మాట నిన్నటి నుంచి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. కానీ ఈరోజు కళ్యాణ్ జర్నీ వీడియో వచ్చాక మాత్రం ఆ డిస్కషన్ మొత్తం డైరెక్షన్ మార్చేసింది. వీడియో చూసిన తర్వాత ఆడియన్స్‌లో ఎక్కువమంది “నో డౌట్… కప్పు కళ్యాణ్‌దే” అని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఆ రేంజ్‌లో ఈ ఏవీ ఉంది. టాప్-5లో ఉన్న మిగతా కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ నుంచి వచ్చిన పొగడ్తలతో పోలిస్తే, కళ్యాణ్‌కు వచ్చిన ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది.
ఇది సాధారణ జర్నీ వీడియో కాదు. ఇది కళ్యాణ్ ‘ఏవీ’ కన్నా ఎక్కువగా ‘పడాల వారి పట్టాభిషేకం’లా అనిపించింది. జర్నీ వీడియోకి ముందు బిగ్‌బాస్ చెప్పిన మాటలు ఆడియన్స్ గుండెల్లోకి బుల్లెట్ల్లా దూసుకెళ్లాయి. “సామాన్యుడి కథే కానీ సామాన్యమైన కథ కాదు… జీరో నుంచి మొదలైన ప్రయాణం, కోట్లమంది ప్రేమను సంపాదించుకున్న ప్రయాణం” అంటూ కళ్యాణ్ జర్నీకి అర్థం చెప్పారు. స్నేహం, వ్యూహం, ధైర్యం, గుండె బలం ఎలా అతన్ని ముందుకు నడిపించాయో బిగ్‌బాస్ మాటల్లోనే స్పష్టంగా చూపించారు. తల్లిదండ్రులకు గర్వాన్ని ఇచ్చిన కొడుకుగా కళ్యాణ్ నిలిచిన తీరు ప్రత్యేకంగా హైలైట్ అయ్యింది.
వీడియో ఎడిటింగ్ కూడా అదిరిపోయింది. “సరిలేరు నీకెవ్వరూ”తో అగ్నిపరీక్షలు, టాస్కుల్లో పోరాటం, హౌస్‌లోని ఫన్ యాంగిల్, ప్రియ–శ్రీజలతో బాండింగ్, తనూజతో లవ్ ట్రాక్—all మిక్స్ చేస్తూ ఎమోషన్, ఎనర్జీ రెండింటినీ బ్యాలెన్స్ చేశారు. కెప్టెన్సీ టాస్కులు, నామినేషన్ ఫైట్స్‌కు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూస్‌బంప్స్ తెప్పించింది. డీమాన్ దూరమైన సీన్స్ ఎమోషనల్‌గా టచ్ చేశాయి.
Also Read:MSG:చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ స్టిల్
చివర్లో తల్లి ఎంట్రీ, నాగార్జున సెల్యూట్, సైనిక సాంగ్‌తో ఇచ్చిన ఎండ్ చూస్తే… ఇది జర్నీ వీడియోలా కాక ట్రోఫీ తీసుకునే ముందు వచ్చిన ట్రైలర్‌లా అనిపించింది. కళ్యాణ్ రియాక్షన్ చూస్తే ఆ ఫీలింగ్ ఇంకా స్ట్రాంగ్ అయింది. మొత్తానికి, ఈ వీడియో తర్వాత “విన్నర్ ఎవరు?” అన్న ప్రశ్నకి చాలామందికి సమాధానం ఒక్కటే—కళ్యాణ్.

