BB9:తనూజ జర్నీ..ఎమోషనల్

9
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 102 రోజులు పూర్తి చేసుకుంది. బిగ్‌బాస్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో తనూజ గౌడ జర్నీ వీడియోను ప్రసారం చేయడం ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపింది. విన్నర్ రేస్‌లో ముందున్న తనూజ – కళ్యాణ్‌లలో ఎవరి జర్నీ వీడియో ముందుగా వస్తే వారికి ఓటింగ్‌లో లాభం ఉంటుందనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే కళ్యాణ్ జర్నీ వీడియో చివరి రోజైన శుక్రవారం ప్రసారం కానుంది. దీంతో ఈరోజు తనూజ వీడియో రావడంతో ఆమెకు ఓటింగ్‌లో బూస్ట్ ఖాయమని ఫ్యాన్స్ భావించారు. కానీ బిగ్‌బాస్ ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చాడు.

బాహుబలి సినిమాలో భల్లాలదేవ విగ్రహావిష్కరణ సీన్ గుర్తుందా? తన విగ్రహం ఎంత పెద్దదైనా, ప్రజల నినాదాలు మాత్రం బాహుబలినే మహాకాయుడిగా నిలబెడతాయి. నేటి ఎపిసోడ్ కూడా అచ్చం అలానే అనిపించింది.గార్డెన్ ఏరియాలో తనూజ ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు, కీలక క్షణాలను అందంగా ఏర్పాటు చేసి, రథంపై నిలబెట్టారు. బిగ్‌బాస్ తన ప్రత్యేక శైలిలో తనూజ వ్యక్తిత్వాన్ని, ఆటతీరును, భావోద్వేగాలను విశ్లేషించాడు. నటిగా తెరపై జీవించిన తీరుని, కానీ నటనకు చోటులేని బిగ్‌బాస్ ఇంట్లో నిజమైన తనూజ ఎలా బయటపడిందో వివరించాడు. బంధాలు, వ్యూహాలు, భావోద్వేగాల మధ్య సేనాధిపతిలా ఆట నడిపిన తీరును ప్రశంసించాడు.

కానీ అసలు షాక్ అక్కడే మొదలైంది. తనూజ జర్నీ వీడియో మొదలైనప్పటి నుంచి ఎక్కువగా కనిపించింది… కళ్యాణ్!.వగలాడి పాటతో క్యూట్ సీన్లు, సుమన్ శెట్టితో కామెడీ తర్వాత “నా ఫస్ట్ లవ్ స్కూల్‌లో… అతని పేరు కళ్యాణ్” అన్న డైలాగ్‌తో కథ మొత్తం మారిపోయింది. అక్కడినుంచి లవ్ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో తనూజ–కళ్యాణ్ ఎమోషనల్ జర్నీనే మెయిన్ హైలైట్‌గా మారింది. భరణితో నాన్న బాండింగ్, టాస్క్‌లలో ఫైర్, చివర్లో గొడవలతో వీడియో ముగిసినా… ప్రేక్షకుల మదిలో మాత్రం కళ్యాణ్–తనూజ బాండింగ్ బలంగా నిలిచిపోయింది.15 నిమిషాల వీడియో ముగిసిన తర్వాత తనూజ ఎమోషనల్ అవుతూ బిగ్‌బాస్‌కు, తన ఆడియన్స్‌కు థాంక్స్ చెప్పింది. లోపలికి వచ్చాక కూడా “మన ఇద్దరి ఫుటేజ్ ఇలా వస్తుందని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.మొత్తానికి కళ్యాణ్ జర్నీ వీడియోని లేట్ చేసినా, తనూజ జర్నీ వీడియోలోనే కళ్యాణ్ ఫ్యాన్స్‌కు కావాల్సినంత కిక్ బిగ్‌బాస్ ఇచ్చేశాడనే చెప్పాలి.

Also Read:డెకాయిట్..అందరూ ఎంజాయ్ చేస్తారు!

- Advertisement -