మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ (MHCU) నుంచి వచ్చిన తాజా చిత్రం ‘తమ్మా’లో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. దీపావళి సీజన్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఫ్రాంచైజ్ హైప్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేక సగటు వసూళ్లకే పరిమితమైంది.
ఈ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు. కొన్ని వారాల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చిన తమ్మా, ఇప్పుడు ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం హిందీ, తెలుగు ఆడియోలతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్లో కూడా అందుబాటులో ఉంది.
ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ హారర్-కామెడీ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ కీలక పాత్రల్లో నటించారు. మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాకు సచిన్–జిగర్ సంగీతం అందించారు. అలాగే మలైకా అరోరా, నోరా ఫతేహీ, వరుణ్ ధావన్ ప్రత్యేక అతిథి పాత్రల్లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.
Also Read:BRSLP సమావేశం 21కి వాయిదా

