విజయ్‌..’జన నాయకన్’ అప్‌డేట్

13
- Advertisement -

దళపతి విజయ్ చివరి సినిమా జన నాయకన్ 2026 జనవరి 9న పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా, బాలకృష్ణ–అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ భగవంత్ కేసరి ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన తొలి సింగిల్ “దళపతి కచేరి”కి మంచి స్పందన లభిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, జన నాయకన్ నంబన్ తర్వాత విజయ్ కెరీర్‌లోనే అత్యధిక నిడివి కలిగిన చిత్రంగా నిలవనుంది. ఈ సినిమా సుమారు 186 నిమిషాలు (3 గంటలు 6 నిమిషాలు) నిడివితో ఉండనున్నట్లు తెలుస్తోంది. తుది నిడివిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమాకు చివరి కొన్ని నిమిషాలు దళపతి విజయ్‌కు అంకితంగా ప్రత్యేక ట్రిబ్యూట్‌గా రూపొందించారని సమాచారం.

ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, తాజా సంచలనం మమిత బైజూ కీలక పాత్రలో కనిపించనుంది. బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, కెవిఎన్ ప్రొడక్షన్స్‌కు చెందిన వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read:BRSLP సమావేశం 21కి వాయిదా

- Advertisement -