వెస్టిండీస్‌పై రెండో టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించిన తర్వాత, 2025–27 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ తాజా పాయింట్స్ టేబుల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రెండో టెస్టులో న్యూజిలాండ్ మూడు రోజులకే పైచేయి సాధించింది. వెస్టిండీస్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి సిరీస్‌లో ఆధిపత్యం చాటుకుంది.
ఈ విజయం వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో కివీస్‌కు కలిసొచ్చింది.రెండో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్ ఆరో స్థానంలో ఉండగా, అద్భుత విజయంతో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలోకి చేరింది.
ప్రస్తుతం WTC టేబుల్ ఇలా ఉంది:
1. ఆస్ట్రేలియా – ఆడిన ఐదు మ్యాచ్‌లన్నీ గెలిచింది
2. దక్షిణాఫ్రికా
3. శ్రీలంక / న్యూజిలాండ్ (సంయుక్తంగా)
భారత్ ఆరో స్థానానికి జారింది
న్యూజిలాండ్ విజయం భారత జట్టుపై ప్రతికూల ప్రభావం చూపింది.వెల్లింగ్టన్ టెస్ట్‌కు ముందు భారత్ ఐదో స్థానంలో ఉండగా, కివీస్ జంప్ తర్వాత భారత్ ఆరవ స్థానానికి పడిపోయింది.
ఇప్పటి వరకు భారత్:
గెలిచినవి: 4
ఓడినవి: 4
డ్రా: 1
మొత్తం మ్యాచ్‌లు: 9
ఇటీవలి టెస్ట్‌లలో భారత్ ప్రదర్శన పేలవంగా ఉండటంతో పాయింట్స్ టేబుల్లో వెనుకబడింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఐదో స్థానంలో ఉంది.
Also Read:AP:అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

