నటుడు రాజశేఖర్‌కు ప్రమాదం

4
- Advertisement -

నటుడు రాజశేఖర్ షూటింగ్ సెట్స్‌లో గాయపడి అభిమానులను ఆందోళనకు గురి చేశారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తమిళ సినిమా ‘లబ్బర్ పందు’ రీమేక్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. యాక్షన్ సీన్ చిత్రీకరణలో పాల్గొంటున్న సమయంలో రాజశేఖర్ కాలి వద్దకు తీవ్రమైన దెబ్బ తగిలింది. వెంటనే సెట్స్‌లో ఉన్న యూనిట్ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.

వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు రాజశేఖర్‌కు కాలు పగలకపోయినా తీవ్రమైన ముసిల్ ఇంజరీ అయ్యిందని తెలిపారు. పూర్తిగా కోలుకోవాలంటే కనీసం నాలుగు వారాల పాటు సంపూర్ణ విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ప్రస్తుతం ఆయన ఏవైనా షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

రాజశేఖర్‌కు గాయమైన నేపథ్యంలో ‘లబ్బర్ పందు’ రీమేక్ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. యూనిట్ ఆయన ఆరోగ్యం మెరుగుపడిన తర్వాతే తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే సినిమా కొంత భాగం షూట్ పూర్తయింది. మిగిలిన భాగాలు యాక్షన్ సీక్వెన్స్‌లేనందున రాజశేఖర్ పూర్తిగా ఫిట్ అవ్వకపోతే షూటింగ్ కొనసాగించడం సాధ్యం కాని పరిస్థితి.

రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది.

Also Read:TG:ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల..

- Advertisement -