ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో బిగ్‌బాస్ చిన్న కానీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటికే ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్‌ని మినహాయించి మిగతా హౌస్‌మేట్స్ అందరినీ నేరుగా నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ నిర్ణయంతో హౌస్‌లో ఒక్కసారిగా టెన్షన్ తగ్గిపోవడంతో, కంటెస్టెంట్లు కాస్త కులాశాగా మాట్లాడుకుంటూ సరదా పంచుకున్నారు.
అంతేకాదు, ఇప్పటివరకు ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేకపోయిన భరణికి బిగ్‌బాస్ ప్రత్యేక అవకాశం ఇచ్చాడు. కెప్టెన్సీ ఇస్తున్నానిగాని… ఇమ్యూనిటీ మాత్రం ఉండదని క్లారిటీ ఇచ్చాడు. భరణి కూడా ఈ నిర్ణయాన్ని స్మైల్‌తో అంగీకరించాడు.
ఈ సరదా మధ్య డీమాన్ మాత్రం టాస్కులు ఉంటాయేమోనని టెన్షన్ పడ్డాడు. “టీమ్స్ డివైడ్ చేస్తే నేనింకా ఒంటరివాడినయ్యేనా?” అని అడిగితే, తనూజ వెంటనే “అబ్బే… ఇంకో రెండు వారాలే కదా ఒంటరిగా ఉన్నా పర్లేదు” అంటూ పంచ్ వేసింది. కళ్యాణ్ కూడా ఈ సంభాషణలోకి జంప్ అవడంతో హౌస్‌లో నవ్వుల వాతావరణం నెలకొంది.
ఇమ్మూ అడిగిన ప్రశ్నకు డీమాన్ ఇచ్చిన రిప్లై అందరినీ నవ్వేసింది. “నన్ను ఎవరు అర్థం చేసుకోరు… రీతూ మాత్రం రెండూ చేస్తది!” అని డీమాన్ అల్లరి చేయగా, తనూజ వెంటనే గతం గురించిన ఓ విషయం బయట పెట్టింది. “డే 1 నుంచీ డీమాన్ ఒకటే మాట… ‘తనూజ నన్ను అర్థం చేసుకోదు’ అంటూనే ఉండేవాడు. అసలు ఫస్ట్ నన్నే క్లోజ్ అవుదామనుకున్నాడట… కానీ నేను పట్టించుకోలేదని రీతూకి వెళ్లిపోయాడట!” అంటూ చెప్పడంతో అందరూ పెద్దగా నవ్వేశారు.
ఇదంతా విని ఇమ్మూ, సంజనా కూడా పంచ్‌లతో ఆడుకున్నారు. డీమాన్ మాత్రం “గేలం ఏమీ లేదు… అందరితో ఫ్రెండ్లీగా ఉంటాననే” అంటూ కవర్ చేయడానికి ట్రై చేశాడు. ఈ సరదా కామెడీతో హౌస్‌లో ఆడియన్స్‌కి కూడా ఎంజాయ్‌మెంట్ డబుల్ అయ్యింది.
Also Read:TG:ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల..

