రేవంత్‌కు జగదీశ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

2
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కేసీఆర్ పై నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం..మేము మాట్లాడటం ప్రారంభిస్తే తట్టుకోలేవ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. SLBC టన్నెల్ విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని దాచిపెట్టడానికి సీఎం చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారహితమని ఆయన మండిపడ్డారు. SLBC టన్నెల్‌లో చిక్కుకున్న మృతదేహాలు వెలికి తీయడానికైనా ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. అలాంటి మీరు, ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు.

కేటీఆర్ బయటపెట్టిన రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణం బయల్పడిన తర్వాత రేవంత్ రెడ్డి తీవ్ర నిరాశ, ఆవేదనలో కేసీఆర్‌పై అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన తప్పులను ప్రజల దృష్టి నుండి మళ్లించడానికి సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా తీసుకుని వ్యక్తిగత స్థాయిలో విమర్శించడం తగదని అన్నారు.

“ఆనాడు మీ గురువు చేసిన మోసం వల్లే SLBC ఈరోజు కూడా పూర్తి కాక నల్గొండ ప్రజలు నష్టపోతున్నారు. ఇప్పుడు ఆ బాధ్యతను కేసీఆర్‌పై మోపే అధికారం మీకు లేదు” అని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. ఇంకా ముందుకు వెళ్లి, “రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికే కాంగ్రెస్ నాయకులే సిగ్గుపడుతున్న పరిస్థితి వచ్చింది” అని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులపై రాజకీయ డ్రామాలు ఆపి, ప్రజల సమస్యలపై నిజాయితీగా పనిచేయాలని ఆయన సూచించారు.

Also Read:TG:హైదరాబాద్‌లో ట్రంప్ ఎవెన్యూ

- Advertisement -