బిగ్‌బాస్ సీజన్-9లో రీతూ చౌదరి అనూహ్యంగా ఎలిమినేట్ కావడం హౌస్‌మేట్స్‌కే కాదు ఆడియన్స్‌కూ పెద్ద షాక్ అయింది. అసలు సుమన్ శెట్టి, భరణి, సంజన ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు బయటకు వెళ్లొచ్చని భావించిన ప్రేక్షకులు, రీతూ పేరు అనౌన్స్ చేయగానే కంగారుపడ్డారు. తన ఎలిమినేషన్‌ను రీతూ కూడా ఊహించలేదు. బయటకు వెళ్లే సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం, ముఖ్యంగా డీమాన్ పవన్ గురించి బాధపడటం అందరినీ ఎమోషనల్ చేసింది.
హౌస్‌లోకి ఎంట్రీ కొద్దిసేపటి వరకు రీతూపై నెగెటివ్ కామెంట్స్ ఉన్నప్పటికీ, టాస్కుల్లో ఆమె చూపిన పర్ఫార్మెన్స్ వల్ల ప్రజల అభిప్రాయం మారింది. లేడీ కంటెస్టెంట్స్‌లో టాస్కులు బెస్ట్‌గా చేసినది రీతూనేనని అందరూ ఒప్పుకున్నారు. అయితే పవన్‌తో ఆమె నడిపిన లవ్ ట్రాక్ మాత్రం కొంతమందికి నచ్చలేదు. పవన్ గేమ్‌పై రీతూ ప్రభావం చూపుతోంది అనే చర్చలు బయట ఎక్కువయ్యాయి. అయితే వారం వారం వీరి రిలేషన్ ఆడియన్స్‌కి క్లియర్ అయిపోయింది.
ఎలిమినేషన్ నైట్‌లో సంజన–రీతూ డేంజర్ జోన్‌లో నిలబడగా, చివరకు రీతూకే బిగ్‌బాస్ గుడ్‌బై చెప్పించాడు. “టాప్-5లో నేను ఉండాలి అనుకున్నా.. ఓడిపోయా ఇమ్మూ” అంటూ ఆమె ఎమోషనల్ అయింది. డీమాన్‌కి “వీడిని చూసుకోండి.. కళ్యాణ్ నువ్వు అతనితో మాట్లాడాలి” అని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసింది. బయటకు వెళ్లే ముందు డీమాన్ చెవిలో “కప్పు తీసుకొని వస్తా.. బాగా ఆడతా” అని చెప్పగా, రీతూ కూడా “బాగా ఆడు” అంటూ హగ్గు ఇచ్చింది.
స్టేజ్ మీద నాగార్జునను చూసిన వెంటనే రీతూ పెద్ద హగ్గు ఇచ్చి ఫన్‌గా “ఈ హగ్గుకే ఎన్నిసార్లో ఎలిమినేట్ అవుదామనుకున్నా సార్” అంటూ నవ్వించింది. తన జర్నీ వీడియో చూసి మరోసారి భావోద్వేగానికి లోనైంది. హౌస్‌మేట్స్‌కి ప్లేస్‌లు ఇచ్చేటప్పుడు కళ్యాణ్, డీమాన్, ఇమ్మూ, తనూజ, సంజన అందరికీ హార్ట్‌ఫెల్ట్ మెసేజెస్ చెప్పింది. చివరగా డీమాన్‌కి “కప్పు కొట్టి మా ఇంటికి తీసుకొనిరా” అని చెప్పడం అందరినీ నవ్వించింది.
Also Read:వేద పాఠశాలలో సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్

