Dekock:క్వింటన్ డికాక్‌ అరుదైన రికార్డు

8
- Advertisement -

దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన వికెట్‌కీపర్‌గా చరిత్రలో కొత్త మైలురాయిని నమోదు చేశాడు. విశాఖపట్నంలో జరిగిన భారత్–దక్షిణాఫ్రికా మూడో వన్డేలో డికాక్ శతకంతో మెరిసి ఈ ఘనతను అందుకున్నాడు.

హర్షిత్ రాణా బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో తన సెంచరీని పూర్తి చేసిన డికాక్ 80 బంతుల్లో మూడు అంకెల స్కోరుకు చేరుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండగా, చివరకు ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యేలోపు మొత్తం 89 బంతులు ఆడి 106 పరుగులు చేశాడు. వన్డేల్లో భారత్‌పై ఇది అతడి ఏడో సెంచరీ కావడం విశేషం.
వన్డేల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీలతో ఉన్న వికెట్‌కీపర్లు

క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా) – భారత్‌పై 7 సెంచరీలు

ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) – శ్రీలంకపై 6 సెంచరీలు

కుమార సంగక్కర (శ్రీలంక) – భారత్‌పై 6, బంగ్లాదేశ్‌పై 5, ఇంగ్లాండ్‌పై 4 సెంచరీలు

క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా) – శ్రీలంకపై 4 సెంచరీలు

తాజా శతకంతో డికాక్ భారత్‌పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక లెజెండ్ సనత్ జయసూర్యతో సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఇద్దరూ చెరో ఏడు సెంచరీలు సాధించారు.
భారత్‌పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు

క్వింటన్ డికాక్ (SA) – 23 ఇన్నింగ్స్‌ల్లో 7 సెంచరీలు

సనత్ జయసూర్య (SL) – 85 ఇన్నింగ్స్‌ల్లో 7 సెంచరీలు

ఏబీ డివిలియర్స్ (SA) – 32 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు

రికీ పాంటింగ్ (AUS) – 59 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు

కుమార సంగక్కర (SL) – 71 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు

Also Read:రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్‌:హరీష్‌

- Advertisement -