ఇండిగో సిబ్బందికి మద్దతుగా సోను సూద్

6
- Advertisement -

ఇండిగో విమానాల రద్దు, ఆలస్యాల కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న సమయంలో బాలీవుడ్ నటుడు సోను సూద్ స్పందించాడు. ప్రయాణికుల అసౌకర్యాన్ని అర్థం చేసుకుంటూనే, ఈ సమస్యల్ని పరిష్కరించడానికి సిబ్బంది పడుతున్న శ్రమను కూడా గుర్తుంచుకోవాలని కోరాడు.

ఎక్స్‌లో ఒక వీడియోను షేర్ చేసిన సోను సూద్..విమానాలు రద్దవడం లేదా ఆలస్యమవడం నిజంగా ప్రయాణికులను నిరాశపరుస్తుంది. వారి సమయం, ప్లాన్లు అన్నీ దెబ్బతింటాయి. కానీ ఈ పరిస్థితుల్లో సమస్యను సరిదిద్దేందుకు, ప్రయాణికులకు సహాయం చేయడానికి ఇండిగో సిబ్బంది నిరంతరం కష్టపడుతున్నారు. వాళ్లూ కూడా భారీ ఒత్తిడిలోనే ఉన్నారు అని పేర్కొన్నాడు.

అదే సమయంలో, ప్రయాణికులు సిబ్బందిపై కోపం చూపకుండా, సహానుభూతితో వ్యవహరించాలని సూచించాడు. “దయచేసి ఇండిగో సిబ్బందిపై దయ, గౌరవం చూపండి. వారు మీతో పాటు అదే భారాన్ని మోస్తున్నారు. ప్రతిసారీ వాళ్లకూ పరిస్థితులు అనుకూలంగా ఉండవు. కాబట్టి కొంచెం వినయం, కొంచెం సమన్వయం చూపితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి” అని చెప్పాడు.

ప్రతికూల పరిస్థితుల్లో కూడా పాజిటివ్ అవగాహన పెంచేలా సోను సూద్ ఇచ్చిన ఈ సందేశానికి నెటిజన్లు మంచి స్పందన ఇస్తున్నారు.

Also Read:‘సైక్ సిద్ధార్థ’..అందరికీ నచ్చుతుంది!

- Advertisement -