సచిన్‌ రికార్డుకు చేరువలో విరాట్!

7
- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా శతకాలు బాదిన విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను నిరూపించాడు. వన్డేలలో ఇప్పటికే సచిన్ టెండుల్కర్‌కి సంబంధించిన ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లీ, ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన—వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు అనే రికార్డుకు చేరువయ్యాడు.

దక్షిణాఫ్రికా సిరీస్‌లో రాంచి, రాయ్‌పూర్ మ్యాచ్‌లలో వరుసగా రెండు శతకాలు బాదాడు. బ్యాటింగ్‌లో తన దూకుడును పెంచి, మరింత నమ్మకంగా రాణించాడు. 37 ఏళ్ల కోహ్లీ ఈ ప్రదర్శనలతో 2027 వన్డే ప్రపంచకప్‌కి తాను పూర్తిగా సిద్ధమన్న సందేశం సెలెక్టర్లకు పంపించాడు.

రాయ్‌పూర్‌లో అతడు చేసిన 102 పరుగుల ఇన్నింగ్స్‌తో కోహ్లీ వన్డేల్లో మొత్తం 14492 పరుగులు చేరాడు. ప్రస్తుతం అతడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌ రికార్డుకు 3934 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్ వన్డేల్లో మొత్తం 18426 పరుగులు సాధించాడు.

వన్డేల్లో అత్యధిక పరుగులు:

సచిన్ టెండుల్కర్ – 18426

విరాట్ కోహ్లీ – 14492

ఇదే ఫామ్‌ను విరాట్ కంటిన్యూ చేస్తే సచిన్ రికార్డును అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read:పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్ హ్యాక్!

- Advertisement -