బిగ్‌బాస్ సీజన్-9లో ఫస్ట్ ఫైనలిస్ట్ రేసు రోజురోజుకీ కొత్త మలుపులు తీసుకుంటోంది. ఇప్పటికే సంజన, తనూజ రేసు నుంచి బయటకు వెళ్లడం తెలిసిందే. మిగిలిన ఆరుగురిలో నుండి చివరి ముగ్గురు టాస్క్ ఆడే హక్కును ఎవరు సంపాదిస్తారు? అని బిగ్‌బాస్ ఓ ఛాన్స్ ఇచ్చాడు. వెంటనే కళ్యాణ్, డీమాన్, సుమన్ శెట్టి ముందుకు వచ్చారు. వీరికి పవర్ కార్డ్స్ టాస్క్ ఇవ్వడంతో గేమ్ ఇంటెన్స్‌గా మారింది.
ఈ టాస్క్‌లో లెక్కలు, ప్లానింగ్ అన్నీ పక్కాగా వేసిన డీమాన్ కళ్యాణ్, సుమన్ శెట్టిని అవుట్ చేసి ముందుకు వచ్చాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్. తన సరిహద్దులో ఉన్న ప్లేయర్‌ను ఛాలెంజ్ చేయమంటే, రీతూను ఎంచుకునే అవకాశం ఉన్నా… డీమాన్ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ముందే తనను ఓడించిన భరణినే తిరిగి సెలెక్ట్ చేసుకున్నాడు. భరణిని రేసు నుంచి పూర్తిగా తొలగించాలని అతని ప్లాన్ కనిపించింది.
గేమ్ ముందు భరణి–తనూజల మధ్య చిన్న సంభాషణ జరిగింది. “ఏది వచ్చినా మీ బలం చూపండి… గివప్ ఇవ్వరాదు… సెలెక్ట్ చేసిన వాళ్లకే కాక, చూసే వాళ్లందరికీ షాక్ ఇవ్వండి” అంటూ తనూజ భరణిని ప్రోత్సహించింది. ఇదిలా ఉండగా, డీమాన్ తనూజకు “ఈసారి బ్రూటల్‌గా వెళ్తాను… ఫిజికల్ అయితే కూడా వెనక్కి తగ్గను” అని చెప్పిన విషయాన్ని భరణి పంచుకోవడంతో గేమ్‌పై కాసింత టెన్షన్ క్రియేట్ అయింది.
తర్వాత ఇద్దరికీ ‘వారధి కట్టు – విజయం పట్టు’ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. గేమ్ మొదలైన వెంటనే భరణి తనకు ఇచ్చిన ప్లాంక్స్‌తో స్పీడ్‌గా బ్రిడ్జ్ నిర్మించాడు. డీమాన్ మాత్రం ప్లాంక్స్ సరిపోవట్లేదని ఫిర్యాదు చేస్తూ టైమ్ వేస్ట్ చేశాడు. అలా కాలాన్ని వృథా చేసుకున్న డీమాన్‌పై భరణి బ్రిడ్జ్ పూర్తి చేసి బ్యాగ్స్‌ను టేబుల్‌కు విసిరి సూపర్ విజయం సాధించాడు.
ఈ విజయం భరణికి ఎమోషనల్ మోమెంట్‌గా మారింది. మరోవైపు డీమాన్ సమయం చేసుకోలేక ఫస్ట్ ఫైనలిస్ట్ రేసు నుంచి ఔట్ అయిపోయాడు. ప్రస్తుతం రేసులో ఇమ్మానుయేల్, భరణి, సుమన్ శెట్టి, కళ్యాణ్, రీతూ మాత్రమే మిగిలారు. గురువారం ఎపిసోడ్‌లో భరణి–రీతూ–కళ్యాణ్ మధ్య జరిగే కలర్స్ టాస్క్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
Also read:మోనాలిసా.. ‘లైఫ్’ మొదటి షెడ్యూల్

