ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌ల నుండి రాబోయే సినిమాల గురించి ఈ మధ్య వస్తున్న పుకార్లపై సంస్థ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. SVC విడుదల చేసిన ప్రకటనలో, తమ భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని, వాటిలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది.
ఎప్పుడో వచ్చిన పాత ఊహాగానాలను ఇప్పుడున్న విషయాలకు ముడిపెట్టి తప్పుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం తాము బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా, దర్శకుడు అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నామని దిల్ రాజు ధృవీకరించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రాథమిక పనులు (pre-production works) జరుగుతున్నాయి.
Also Read:ఆంధ్ర కింగ్ తాలూకా… అదిరే రెస్పాన్స్
ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే మేమే అధికారికంగా ప్రకటిస్తామని సంస్థ తెలియజేసింది.అధికారిక సమాచారం వచ్చేంతవరకు ఎలాంటి నిర్ధారణలకు రావొద్దని, ధృవీకరించని వార్తలను ప్రచారం చేయవద్దని SVC మీడియా మిత్రులను మరియు సినీ అభిమానులను కోరింది.

