టీడీపీ వర్సెస్‌ వైసీపీ..సోషల్ మీడియా వార్

12
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి టీడీపీ–వైసీపీ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. నారా లోకేశ్ తరచూ హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాల్లో వెళ్తున్నారంటూ వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. గత కొద్దినాళ్లలోనే లోకేశ్ 77 సార్లు హైదరాబాదుకు వెళ్లారని, ఇందుకు భారీగా ప్రజా ధనం వృథా అవుతోందని ఆరోపణలు చేసి వైరల్ పోస్ట్‌లతో దాడి ప్రారంభించారు.

వెంటనే టీడీపీ కౌంటర్ ఇచ్చింది. లోకేశ్ హైదరాబాదుకు వెళ్లే ఖర్చు మొత్తం ఆయన వ్యక్తిగతమేనని, ఒక్క పైసా కూడా ప్రభుత్వ నిధులు ఉపయోగించడం లేదని స్పష్టం చేసింది. అధికార పార్టీ చేసే ఆరోపణలు పూర్తిగా నిరాధారమని టీడీపీ స్టేట్‌మెంట్ హైలైట్ చేసింది.

ఇక్కడితో ఆగకుండా టీడీపీ, జగన్ గతంలో చేసిన హెలికాప్టర్ మరియు స్పెషల్ ఫ్లైట్ ప్రయాణాల లెక్కలు బయటపెట్టింది. “ప్రజాధన వృథా ఎవరు చేశారు?” అంటూ కౌంటర్ ప్రశ్నలు వేసింది. దీంతో ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ మరింత ముదురింది.

వైసీపీ నాయకులు తమవైపు నుంచి మళ్లీ లోకేశ్‌పై విమర్శలు పెంచి, టీడీపీ లెక్కలు రాజకీయ డ్రామా మాత్రమేనని తిప్పికొట్టారు.

Also Read:BB9:తనూజ టార్గెట్‌తో ఓడిన డీమాన్

- Advertisement -